దీపావళి బొనాంజా.. నిర్మాణ కార్మికులకు గుడ్‌ న్యూస్‌

3 Nov, 2021 18:56 IST|Sakshi

చంఢీగడ్: రాష్ట్రంలోని భవన, ఇతర నిర్మాణ కార్మికులకు దీపావళి కానుక అందించనున్నట్లు పంజాబ్‌ ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్‌ కారణంగా నిర్మాణ పనులు తగ్గటంతో వేలాది మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారికి ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఆర్థిక సాయం అందిస్తామని పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ బుధవారం ప్రకటించారు.

బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమబోర్డు(BOCW)లో రిజిస్టర్‌ అయిన ప్రతి కార్మికుడికి దీపావళి పండగను పురస్కరించుకొని రూ.3,100 ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ట్వీటర్‌లో పేర్కొన్నారు. సీఎం ప్రకటనతో భవన, ఇతర నిర్మాణ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 3.17 మంది కార్మికులు అధికారికంగా బీఓసీడబ్ల్యూలో రిజిస్టర్‌ అయి ఉన్నారు. అయితే ఈ ఆర్థిక సాయం నేరుగా కార్మికుల బ్యాంక్‌ ఖాతాలో చేరనుంది.

మరిన్ని వార్తలు