దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి

14 Oct, 2021 05:35 IST|Sakshi

బీఎస్‌ఎఫ్‌ పరిధి పెంపును ఉపసంహరించుకోవాలి

కేంద్రానికి పంజాబ్‌ సీఎం వినతి

చండీగఢ్‌: పంజాబ్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) పరిధిని సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల దాకా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో ఈ పరిధి కేవలం 15 కిలోమీటర్లుగా ఉంది. దీన్ని కేంద్రం తాజాగా 50 కిలోమీటర్లకు పెంచింది. తద్వారా ఈ పరిధిలో నివసించే ఎవరినైనా విచారించే, అరెస్టు చేసే, సోదాలు చేపట్టే అధికారం బీఎస్‌ఎఫ్‌కు ఉంటుంది. ఈ నిర్ణయాన్ని దేశ సమాఖ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడిగా పంజాబ్‌ సీఎంæ చన్నీ అభివర్ణించారు. అంతర్జాతీయ సరిహద్దు నుంచి బీఎస్‌ఎఫ్‌ పరిధిని పెంచడం సమంజసం కాదని తేల్చిచెప్పారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కోరారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు