Tajinder Bagga: చిత్ర విచిత్ర మ‌లుపులు.. తజిందర్‌ బగ్గాపై మరోసారి అరెస్ట్‌ వారెంట్‌ జారీ

7 May, 2022 18:49 IST|Sakshi

అనేక రాజకీయ మలుపుల అనంతరం పంజాబ్‌ బీజేపీ నాయకుడు  తజిందర్ పాల్ సింగ్‌పై మోహాలీ కోర్టు శనివారం తాజా అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. తాజిందర్‌ బగ్గాపై ఐపీసీ సెక్షన్‌  153ఏ, 505,505(2), 506 కింద కేసులు నమోదయ్యాయి. దీంతో మోహాలీ కోర్టు ఆదేశాలను అనుసరించి జిల్లా మెజిస్ట్రేట్‌ తజిందర్‌ బగ్గాను అరెస్టుచేసి కోర్టు ముందు హాజరు పరచాలని సైబర్‌ క్రైం పోలీసులను కోరింది. 

కాగా ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అర‌వింద్ కేజ్రీవాల్‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డిన ఆరోపణలపై తజింద‌ర్ పాల్ సింగ్ బ‌గ్గాను శుక్రవారం పంజాబ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. పంజాబ్‌ పోలీసులు ఢిల్లీలో ఆయన నివాసానికెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అయితే బగ్గాను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని, కనీసం తలపాగా కూడా కట్టుకోనివ్వలేదని బగ్గా తల్లిదండ్రులు ఆరోపించారు. ఢిల్లీలో త‌న కొడుకును కిడ్నాప్ చేశార‌ని తేజింద‌ర్ పాల్ సింగ్ తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పంజాబ్‌ పోలీసులపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 
చదవండి: వీడియో: వెంటపడి మరీ మహిళను చితకబాదిన లాయర్‌

తేజింద‌ర్‌ను మొహాలీకి తీసుకెళ్తున్న పంజాబ్ పోలీసులను హ‌ర్యానా పోలీసులు అడ్డుకున్నారు. బగ్గాను అరెస్ట్‌ చేయడంలో సరైన నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. పంజాబ్‌ పోలీసుల నుంచి ఆయన్ను విడిపించి ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. అనంతరం పంజాబ్ పోలీసులు తేజింద‌ర్‌ను హ‌ర్యానా పోలీసుల‌కు అప్ప‌గించాల‌ని, ఢిల్లీకి అప్ప‌గించొద్ద‌ని పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అయితే పంజాబ్ ప్ర‌భుత్వ డిమాండ్‌ను హైకోర్టు త‌ప్పుబ‌ట్టింది. కిడ్నాపింగ్ ఫిర్యాదు ఆధారంగా త‌మ‌కు అప్ప‌గించాల‌ని ఢిల్లీ పోలీసులు అభ్యర్థించింది దీంతో సెర్చ్ వారంట్ కోసం కోర్టును ఆశ్ర‌యించారు. న్యాయ‌స్థానం నుంచి సెర్చ్ వారంట్ తీసుకుని కురుక్షేత్ర పోలీస్ స్టేష‌న్‌కెళ్లి తేజింద‌ర్ బ‌గ్గాను త‌మ ఆధీనంలోకి తీసుకుని ఢిల్లీకి త‌ర‌లించారు.

మరిన్ని వార్తలు