పంజాబ్‌ నూతన సీఎంగా చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ

19 Sep, 2021 18:44 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీకి అవకాశం దక్కింది. ఆదివారం సమావేశమైన కాంగ్రెస్‌ శాసన సభా పక్షం సీఎంగా చన్నీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ మేరకు పంజాబ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి హరీష్‌ రావత్‌ ట్విటర్‌లో వెల్లడించారు. చన్నీకి సీఎం బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
చదవండి: Amarinder Singh: కెప్టెన్‌ కథ కంచికి చేరిందిలా!

ఇక తాజా మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌.. పీసీసీ చీఫ్ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ మధ్య విభేదాల కారణంగా రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తలెత్తిన సంగతి తెలిసిందే. మరోవైపు అధిష్టానం కూడా కెప్టెన్‌ రాజీనామాకే మొగ్గు చూపిందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సీఎం పదవికి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ శనివారం రాజీనామా చేశారు. ఆయనతో పాటు మంత్రులు కూడా గవర్నర్‌కు రాజీనామా సమర్పించగా ఆయన ఆమోదించారు.

చరణ్‌ జీత్‌ సింగ్‌ చన్నీ దళిత వర్గానికి చెందిన నేత. తొలుత సుఖ్‌జీందర్‌ సింగ్‌ రాంద్వాను పంజాబ్‌ సీఎంగా నియమించాలని భావించినా కాంగ్రెస్‌కు నవజ్యోత్‌సింగ్‌ సిద్దూ వర్గం నుంచి వ్యతిరేకత రావడంతో తిరిగి పునరాలోచనలు చేయాల్సి వచ్చింది.

చదవండి:  సిద్దూ వర్సెస్ అమరీందర్, రాజీనామా బాటలో సీఎం?

మరిన్ని వార్తలు