భేటీకి కేంద్ర మంత్రుల గైర్హాజరు

15 Oct, 2020 06:47 IST|Sakshi
ఢిల్లీలో కృషిభవన్‌ వెలుపల రైతుల నిరసన

ఆగ్రహించిన అన్నదాతలు

సాగు చట్టాల ప్రతుల చించివేత, సమావేశం నుంచి వాకౌట్‌  

న్యూఢిల్లీ/చండీగఢ్‌: కొత్త వ్యవసాయ చట్టాలపై పంజాబ్‌ రైతుల ఆందోళనను తీర్చడానికి కేంద్ర వ్యవసాయ శాఖ దేశ రాజధాని ఢిల్లీలోని కృషి భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశాన్ని అన్నదాతలు బహిష్కరించారు. ఈ భేటీకి కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమార్‌తో పాటు, సహాయ మంత్రులు గైర్హాజరు కావడంతో 29 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు సమావేశాన్ని వాకౌట్‌ చేసి, వ్యవసాయ చట్టం ప్రతుల్ని చించేశారు.

సమావేశానికి పిలిచి అవమానిస్తారా..?  
వ్యవసాయ చట్టాలపై తమకున్న ఆందోళనల్ని తొలగిస్తామని ఢిల్లీ పిలిచి మరీ తమని పట్టించుకోలేదని రైతు సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కేంద్ర మంత్రులెవరూ ఈ సమావేశానికి హాజరు కానప్పుడు, భేటీని ఎందుకు ఏర్పాటు చేశారు ?  కేంద్రం ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోంది’’ అని రైతు సంఘాల సమన్వయ కమిటీ సభ్యుడు దర్శన్‌ పాల్‌ చెప్పారు.  తమ ప్రశ్నలకు సరైన సమా« ధానాలు ఇవ్వకపోవడంతో వాకౌట్‌ చేశా మన్నారు. దీనిపై వివాదం రేగడంతో ప్రభుత్వం వివరణ ఇస్తూ, షెడ్యూల్‌ ప్రకారం ఇది కార్యదర్శుల స్థాయి సమావేవమని పేర్కొంది. రైతులతో చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధమేనని, వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. 

మరిన్ని వార్తలు