టీకా వివాదం.. వెనక్కి తగ్గిన అమరీందర్‌ సర్కార్‌

4 Jun, 2021 20:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రైవేట్‌ ఆస్పత్రులకు టీకా కేటాయింపు

జనాలు, విపక్షాల విమర్శలతో వెనక్కి తగ్గిన సర్కార్‌

చండీగఢ్‌: ఓ వైపు జనాలు కోవిడ్‌ టీకాల కొరతతో ఇబ్బంది పడుతుంటే.. మరో వైపు ప్రభుత్వాలు ప్రైవేట్‌ ఆస్పత్రులకు టీకాలను కేటాయిస్తూ.. జనాలకు అన్యాయం చేస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లో ఇదే ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో టీకాల దందాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పంజాబ్ సర్కారు ప్రైవేటు హాస్పిటల్స్ కు టీకాల సరఫరా నిలిపివేసింది. ప్రభుత్వం టీకాలు మళ్లించి కోట్లు దండుకుంటున్నట్టు విపక్ష అకాలీదళ్ ఆరోపణలో నేపథ్యంలో అమరీందర్‌ సింగ్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

18-44 సంవత్సరాల వయసువారికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ ప్రైవేటు హాస్పిటల్స్ ద్వారా సమకూర్చేందుకు పంజాబ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై విపక్ష అకాలీదళ్ మండిపడింది. భారీ లాభాలకు కోవాగ్జిన్ టీకాలను మళ్లించిందని ఆరోపించింది. 400 రూపాయలకు వచ్చే టీకాను సర్కారు ప్రైవేటు హాస్పిటల్స్‌కు 1060 రూపాయలకుకి అమ్ముతున్నదని, ఆస్పత్రులు దానిని ప్రజలకు 1560 రూపాయలకు అమ్ముతున్నాయని శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ ట్విట్టర్‌లో ఆరోపించారు.

ప్రజల్లో కూడా టీకాల వ్యవహారంపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో సర్కారు తన ఉత్తర్వులను శుక్రవారం సాయంత్రానికి ఉపసంహరించుకున్నది. ఈ వ్యవహారాన్ని గమనించిన కేంద్ర సర్కారు మొత్తం టీకాల లెక్క తెలియజేయమని పంజాబ్‌లోని అమరీందర్ సర్కారును ఆదేశించింది.

చదవండి: షాకింగ్‌గా ఉంది.. ఇలా జరగాల్సింది కాదు!

>
మరిన్ని వార్తలు