Vijay Singla: అవినీతి ఆరోపణలు.. పంజాబ్‌ సీఎం సంచలన నిర్ణయం.. మంత్రి అరెస్ట్‌

24 May, 2022 14:26 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌ ఆరోగ్యశాఖ మంత్రి విజయ్‌ సింఘ్లాను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రి విజయ్‌ సింగ్లాపై అవినీతి ఆరోపణలు రావడంతో పదవి నుంచి బర్తరఫ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. టెండర్ల కోసం సింగ్లా ఒక శాతం కమీషన్‌ డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. అంతేగాక తాను చేసిన తప్పులను సింఘ్లా ఒప్పుకున్నట్లు కూడా తెలిపారు.

ఈ మేరకు బుధవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఒక్క శాతం అవినీతిని కూడా తాము ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. మంత్రికి సంబంధించిన అవినీతి ఆరోప‌ణ‌ల‌పై త‌మ‌వ‌ద్ద స‌మాచారం ఉంద‌ని, వాటిపై విచార‌ణ చేయిస్తామ‌ని సీఎం చెప్పారు. ఇక ఆరోగ్యశాఖమంత్రిపై కేసు నమోదు చేయాలని పంజాబ్‌ పోలీసులను ఆదేశించారు. మంత్రిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన సీఎం కేబినెట్‌ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పదవి నుంచి తొలగించిన వెంటనే ఏసీబీ అధికారులు మంత్రిని అరెస్ట్‌ చేశారు.
చదవండి: టార్గెట్‌ @ 2024.. సోనియా మరో సంచలన నిర్ణయం

మరిన్ని వార్తలు