షాకింగ్‌ ఘటన: ‘ఆ అమ్మాయిలు నన్ను గ్యాంగ్‌రేప్‌ చేశారు’.. సుమోటో కేసులో నిఘా విభాగం దర్యాప్తు

23 Nov, 2022 19:51 IST|Sakshi

క్రైమ్‌: దేశవ్యాప్తంగా వరుసగా దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం ఏదో ఒక నేరం జరిగిన తీరు.. సంఘంలోని పరిస్థితులపై తీవ్రస్థాయి చర్చకు దారి తీస్తోంది. ఈ క్రమంలో పంజాబ్‌లో జరిగిన ఓ వివాహితుడి గ్యాంగ్‌ రేప్‌ ఘటన పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 

పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఓ వ్యక్తి.. తనను నలుగురు అమ్మాయిలు గ్యాంగ్‌ రేప్‌ చేశారంటూ మీడియాకు ఎక్కాడు. కారులో వచ్చిన నలుగురు అమ్మాయిలు.. తనపై మత్తు మందు చల్లి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డారని వాపోయాడతను. వాళ్లంతా పెద్దింటి అమ్మాయిల్లాగా ఉన్నారని, ఇంగ్లీష్‌తో పాటు పంజాబీలో మాట్లాడారని చెప్పాడతను. తనను అపస్మారక స్థితికి తీసుకెళ్లి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారని వాపోయాడు. ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీయడంతో.. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

బాధితుడి కథనం ప్రకారం.. సదరు వ్యక్తి కూలీ పనులు చేసుకుంటున్నాడు. సోమవారం పని ముగిశాక కపుర్తలా రోడ్‌లో ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో తెల్ల కారు ఒకటి వచ్చి ఆగింది. అడ్రస్‌ చెప్పమంటూ ఓ చీటి చూపించారు కారులో ఉన్న అమ్మాయిలు. వెంటనే అతని కళ్లలో ఏదో కెమికల్‌ చల్లగా.. అతను స్పృహ కోల్పోయాడు. ఆపై కారులో అతని కాళ్లు చేతులు కట్టేసి.. కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లారు. ఆపై అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ప్రతిఘటించేందుకు వీళ్లు లేకుండా అతనికి ఏవో ఇంజెక్షన్‌లు ఇచ్చి.. బలవంతంగా మందు తాగించారు. ఆపై ఆ నలుగురు అమ్మాయిలు ఆ వ్యక్తిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 

ఘాతుకం తర్వాత అర్ధరాత్రి సమయంలో తిరిగి అతన్ని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఎలాగోలా ఇంటికి చేరుకున్న అతను.. భార్యకు జరిగిన విషయం చెప్పాడు. భార్యాబిడ్డలు ఉండడంతో పరువు పోతుందనే భయంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే భార్య బలవంతం మేరకు స్థానిక మీడియా ముందుకు వచ్చి తన గోడును వెల్లబోసుకున్నాడు. ఈ కథనాలు సంచలనం సృష్టించడంతో పంజాబ్‌ పోలీసు నిఘా విభాగం సుమోటోగా కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు ప్రారంభించింది.

ఇదీ చదవండి: ప్రతి 11 నిమిషాలకు.. ఒక యువతి బలి!

మరిన్ని వార్తలు