గాలి కోసం 10 వేల మొక్కలు నాటాడు.. చివరికి గాలి అందక కన్నుమూశాడు

10 Jun, 2021 18:47 IST|Sakshi

చంఢీగడ్‌: ప్రజలు స్వచమైన గాలిని పీల్చాలని ఊరంతా మొక్కలు నాటిన ఓ వ్యక్తి.. చివరికి అదే గాలి అందక మరణించాడు. ఈ ఘటన పంజాబ్‌లోని ధోబ్లాన్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ధోబ్లాన్‌కు చెందిన 67 ఏళ్ల హర్‌దయాళ్‌ సింగ్‌  ప్రతిరోజూ ఉదయం తన సైకిల్‌పై మొక్కలతో తన ఇంటి నుంచి బయలుదేరి, గ్రామ సరిహద్దులో మొక్కలు నాటుతుండే వాడు. ఆయన తన గ్రామస్తులకు స్వచ్ఛమైన గాలి అందించాలనే లక్ష్యంతో ఈ పనిని పూనుకున్నాడు.

కాగా ఈ క్రమంలో సుమారు 10 వేల మొక్కలు పైగా నాటాడు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ రాగా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని సింగ్ భార్య గ్రామస్తులకు తెలిపింది. కాగా మే 18న గ్రామస్తులు సింగ్‌కు వైద్యం అందించాలని ఆస్పత్రిలో బెడ్‌ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా 28 గంటల వరకు వారికి బెడ్‌ దొరకలేదు. చివరకు మే 19న చండీఘర్‌లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే, అప్పటికే చాలా ఆలస్యం అయినందున మే 25 న సింగ్‌ మరణించాడు. ఎంతోమందికి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలని పరితపించిన సింగ్‌కు అదే గాలి అందక మరణించడం బాధాకరమని గ్రామస్తులు అంటున్నారు.

చదవండి: ‘అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లనే అత్యాచారాలు’

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు