కోడి గుడ్ల కోసం.. ఛీ ఇదేం పాడు పని పోలీసు

15 May, 2021 20:56 IST|Sakshi

చంఢీగడ్‌: దొంగ‌లని పట్టుకోవాల్సిన పోలీసే.. దొంగ‌గా మారాడు. అది కూడా కోడి గుడ్ల కోసం. వినడానికి వింతగా ఉన్నా ఈ ఘ‌ట‌న పంజాబ్‌లోని ఫ‌తేఘ‌ర్ సాహిబ్ టౌన్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. రోడ్డు ప‌క్కన ఓ గుడ్ల వ్యాపారి సైకిల్‌ మీద గుడ్ల ట్రేను ఉంచి ఏదో ప‌ని నిమిత్తం ప‌క్కకు వెళ్లాడు. అటుగా వచ్చిన హెడ్ కానిస్టేబుల్ ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో భలే చాన్స్‌ అనుకుని గుడ్ల ట్రేలో నుంచి కొన్ని గుడ్లని తీసుకుని తన ప్యాంట్‌లో వేసుకున్నాడు. గుడ్ల వ్యాపారి అక్కడ‌కు రాగానే.. ఏమి తెలియ‌న‌ట్లు అటు నుంచి మెల్లగా జారుకున్నాడు. అటుగా వెళ్తున్న ఆటోను ఆపి అందులో ఎక్కి వెళ్లిపోయాడు. ఆ పోలీసు ఎవరూ చూడలేదు అనుకున్నాడు గానీ కెమెరా ముందు దొరికిపోయాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తూ వైర‌ల్ అయ్యింది. గుడ్ల దొంగ‌త‌నానికి పాల్పడిన హెడ్ కానిస్టేబుల్‌ను ప్రీత్‌పాల్ సింగ్‌గా గుర్తించారు. అతడిని  విధుల నుంచి పోలీసు ఉన్నతాధికారులు స‌స్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

( చదవండి: చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తారో చూద్దామని ‘చనిపోయింది’! )

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు