4 క్షేత్రాలు.. 40 కష్టాలు

19 May, 2022 19:12 IST|Sakshi

చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ దర్శనాల కోసం  భక్తులు పోటెత్తుతున్నారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు దర్శనాలు రద్దు కావడంతో ఇప్పుడు పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. ‍కొండదారుల్లో అత్యంత క్లిషమైన ప్రయాణం సాగించడమే కాకుండా మంచు, చలి, ప్రకృతి పరంగా అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. మధ్యాహ్నం పూట కేవలం 5 డిగ్రీల ఉష్ఞొగ్రత, రాత్రిపూట మైనస్‌ డిగ్రీల ఉష్ఞొగ్రతలు నమోదు కావడంతో భక్తులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. గత రెండు రోజులుగా 39 భక్తులు మృతి చెందడమే ఇందుకు ఉదాహరణ. 

ఈ పుణ్యక్షేత్రాల ప్రయాణంలో వసతి సౌకర్యాలు లేకపోతే ఆ కష్టాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. సముద్ర మట్టానికి 3 కిలోమీటర్ల కంటే ఎత్తున క్షేత్రాలు ఉండటంతో తక్కువ స్థాయిలో ఆక్సిజన్‌ లభ్యమవుతుంది. దాంతో గతంలో కోవిడ్‌ వచ్చిన భక్తులు ఆకస్మికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ యాత్రలకు రోజూ 20వేల మంది పైగా భక్తులు వస్తుండటంతో ఏర్పాట్లకు క్లిష్టంగా మారింది. కొండలపై సౌకర్యం ఉన్నది కేవలం 5వేల మందికే కావడంతో భారీ సంఖ్యలో వస్తున్న భక్తులకు ఏర్పాట్లు చేయలేమంటున్నారు అధికారులు. 

అత్యంత క్లిషమైన ప్రయాణం కేదార్‌నాథ్‌
ఈ యాత్రల్లో కేదార్‌నాథ్‌ అత్యంత క్లిషమైంది. గౌరీఖుండ్‌ నుంచి కేదార్‌ నాథ్‌కు 18 కి.మీ ట్రెక్కింగ్‌ సౌకర్యం ఉన్నా,  ట్రెక్కింగ్‌ సమయంలో హైబీపీ, గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. పరిస్థితి తీవ్రం కావడంతో 132 మంది డాక్టర్లను ఉత్తరాఖాండ్‌ ప్రభుత్వం రంగంలోకి దించింది. అదే సమయంలో ముందస్తు ఏర్పాట్లు లేనిదే చార్‌ధామ్‌ యాత్రకు రావద్దని ప్రభుత్వం అంటోంది. సరిపడా అందుబాటులో లేని రవాణా సౌకర్యాలతో పాటు, హరిద్వార్‌-రుషికేష్‌ మధ్య వాహనాలు భారీగా నిలిచిపోవడం అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారింది. రుద్ర ప్రయాగ నుంచి అన్ని రూట్లలో విపరీతమైన ట్రాఫిక్ జామ్‌ అవుతూ ఉండటంతో అధికారులకు తలనొప్పిగా మారింది. 

మరిన్ని వార్తలు