ఆ నేత ఎంగేజ్‌మెంట్‌ రోజే.. భారీ మెజార్టీతో పార్టీ గెలుపు

13 May, 2023 20:20 IST|Sakshi

ఎంగేజ్‌మెంట్‌ రోజునే ఓ నాయకుడి పార్టీ కూడా ఘన విజయం సాధించడం అనేది అత్యంత అరుదైన సందర్భం. అలాంటి అరుదైన ఘటన ఆప్‌ నేత దక్కించుకున్నాడు. అసలేం జరిగిందంటే.. న్యూఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో ఆప్‌ నాయకుడు రాఘవ్‌ చద్ధా, నటి పరిణీతి చోప్రాతో ఎంగేజ్‌మెంట్‌ శనివారం జరిగనుంది. ఇదే రోజు ఆయన పార్టీ కూడా భారీ మెజార్టీతో గెలిచింది. దీంతో తనకు ఈ రోజు మరింత ప్రత్యేకమని ఆనందంగా చెబుతున్నారు రాఘవ్‌ చద్దా.

ఈ ఫంగ్షన్‌కి దంపతుల కుటుంబ సభ్యులు, సన్నిహితుల తోసహా 150 మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వేడుకకు పరిణీతి కజిన్ గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా కూడా హాజరుకానున్నారు. సరిగ్గా ఈ రోజే జలంధర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఈ మేరకు రాఘవ్‌ చద్దా ట్విట్టర్‌ వేదికగా..ఈ రోజు నాకు మరింత ప్రత్యేకమైనది మాత్రమే గాక మంచి జ్ఞాపకం కూడా. నా తల్లి ఇల్లు లాంటి జలంధర్‌లో ఈ రోజు ఆప్‌ మంచి ఘన విజయ సాధించింది. అని ట్వీట్‌ చేశారు.

ఇదిలా ఉండగా, మే 10 జరిగిన జలంధర్‌ లోక్‌సభ ఉపఎన్నికల్లో చతుర్ముఖ పోటీ జరిగింది. ఆప్‌లోకి మారిన కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే సుశీల్‌ కుమార్‌ రింకూ కాంగ్రెస్‌కు చెందిన కరమ్‌జిత్‌ కౌర్‌పై 58 వేల ఆధిక్య ఓట్లతో విజయం సాధించారు.అని ట్వీట్‌ చేశారు. అయితే ఈ కరమ్‌జిత్‌ కౌర్‌ ఈ ఏడాది జనవరిలో భారత్‌ జోడో యాత్రలో మరణించిన సంతోష్‌ చౌదరి భార్య. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ విజయాన్ని అపూర్వమైనది అని పేర్కొన్నారు.

అంతేగాదు పంజాబ్‌లో భగవంత్‌ మాన్‌ ప్రభుత్వం మంచిగా పని చేయడం వల్లే తాము గెలిచామని అన్నారు కేజ్రీవాల్‌. ఈ నేపథ్యంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మేము రాజకీయాల్లోకి వచ్చి పనిచేసేందుకు ప్రజలను ఓట్లు అడుగుతాం. మేము మా పని చేశాం, తమ వెంట ప్రజలు ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు మా బాధ్యతను, విశ్వాసాన్ని మరింత పెంచాయన్నారు. అలాగే పంజాబ్‌ని మరింతగా అభివృద్ధి చేసేందుకు మరింతగా కష్టపడతాం అని భగవంత్‌ మాన్‌ అన్నారు.  

(చదవండి: ఇది సంతృప్తి చెందాల్సిన సమయం కాదు!: శశి థరూర్‌)

మరిన్ని వార్తలు