ఏపీ సర్కారు వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వం: సుప్రీం

25 May, 2021 14:41 IST|Sakshi

న్యూఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును కొట్టారనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. అయితే తన పిటిషన్‌ను సవరించుకున్న రఘురామ తరఫు న్యాయవాది రోహత్గీ సవరించుకున్నారు. ప్రతివాదులుగా కేవలం కేంద్రం, సీబీఐ మాత్రమే కావాలనే విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. అయితే సుప్రీంకోర్టు నిర్ణయంపై న్యాయవాది దవే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ సర్కారు వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆ కేసును ఆరు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిని కించపరుస్తూ, ఓ సామాజిక వర్గాన్ని, మతాన్ని టార్గెట్‌ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి.. అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు