Rahul Gandhi: ప్రజలు అడిగే ప్రశ్నలను కాదు..కరోనాను ఆపండి

19 May, 2021 10:39 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ టీకాలను అందరికీ అందుబాటులోకి తెచ్చి ఉంటే దేశం ప్రస్తుతం ఇలాంటి బాధాకరమైన పరిస్థితులను చవి చూడాల్సి వచ్చేది కాదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. చిన్నారుల కోసం కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌– ట్రీట్‌మెంట్‌ ప్రోటోకాల్‌ను అమల్లోకి తేవాలన్నారు. ‘ప్రధాని మోదీని ప్రశ్నించినందుకు ఎంత సులువుగా అరెస్టులు చేశారో, అంతే తేలిగ్గా అందరికీ అందుబాటులోకి టీకా తీసుకు వచ్చినట్లయితే దేశంలో ఇలాంటి గడ్డు పరిస్థితులు దాపురించేవి కాదు. ప్రజలు అడిగే ప్రశ్నలను కాదు, కరోనాను ఆపండి’అని రాహుల్‌ మంగళవారం ట్విట్టర్‌లో ప్రభుత్వాన్ని విమర్శించారు.

‘రానున్న రోజుల్లో, చిన్నారులకు కరోనా నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం పీడియాట్రిక్‌ సేవలు, వ్యాక్సిన్‌– ట్రీట్‌మెంట్‌ ప్రోటోకాల్‌ను ముందుగానే సిద్ధం చేయాలి’అని కేంద్రాన్ని అప్రమత్తం చేశారు. దేశ భవిష్యత్తుకు ప్రస్తుత మోదీ వ్యవస్థను నిద్ర నుంచి మేల్కొలపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

(చదవండి: నా భర్తకు ఇంజెక్షన్లు ఇవ్వండి.. లేకపోతే చస్తా!)

మరిన్ని వార్తలు