కరోనా విలయం: ‘టీకా ఉత్సవ్‌’ వ్యాఖ్యలపై రాహుల్‌ మండిపాటు

9 Apr, 2021 13:49 IST|Sakshi

విదేశాలకు వ్యాక్సిన్ల ఎగుమతి ఎంతవరకు సమంజసం : రాహుల్‌

పక్షపాతం లేకుండా తక్షణమే వ్యాక్సిన్‌ అందరికీ అందించాలని డిమాండ్‌

ఆయా రాష్ట్రాలకు  డిమాండుకు సరిపడా టీకా సరఫరా  చేయాలి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్ల‌ కొరత పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా దేశంలో వ్యాక్సిన్ కొరత చాలా తీవ్రంగా ఉందన్నారు. కనుక ఈ సమయంలో విదేశాలకు వ్యాక్సిన్ల ఎగుమతి ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రధాని వ్యాక్సినేషన్‌ను ‘టీకా ఉత్సవ్’‌ పేరిట జరపడానికి ఇది వేడుక కాదని రాహుల్‌ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం అన్నిరాష్ట్రాలకు ఎలాంటి పక్షపాతం లేకుండా సహాయం చేయాలి. మనమందరం కలిసి ఈ మహమ్మారితో పోరాడి ఓడించాలని సూచించారు. ‘టీకా ఉత్సవ్‌’‌ నిర్వహించే ప్రధాని ముందుగా వాటి కొరత లేకుండా చూడాలని రాహుల్‌ కోరారు. కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ల కొరతతో ఇబ్బంది పడతోంది, కనుక ఆయా రాష్ట్రాల డిమాండుకు సరిపడా టీకా సరఫరా చేయాలని  ఆయన  సూచించారు.

( చదవండి: కరోనా కట్టడికి ఐదంచెల వ్యూహం )

మరిన్ని వార్తలు