దేశంలో కరోనా మరణాలు.. హాట్‌ టాపిక్‌గా రాహుల్‌ గాంధీ కామెంట్స్‌

6 May, 2022 11:58 IST|Sakshi

దేశంలో కోవిడ్‌ మరణాలపై ఆందోళన నెలకొంది. తాజగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా జనవరి 2020-2021 డిసెంబర్‌ చివరకు ప్రత్యక్షంగా లేదంటే.. పరోక్షంగా 1.49 కోట్లమంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఈ క‍్రమంలోనే భారత్‌లో కరోనా మరణాలు 47 లక్షలని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. అయితే, ఈ ప్రకటనను భారత్‌ అంగీకరించలేదు. మరణాల లెక్కింపునకు సంస్థ అనుసరించిన పద్ధతులపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.ఈ నేపథ్యంలో దేశంలో కరోనా మరణాలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 

కోవిడ్‌ మరణాలపై శుక్రవారం రాహుల్‌ ట్విట‍్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘కోవిడ్ మహమ్మారి కారణంగా 47 లక్షల మంది భారతీయులు మరణించారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు 4.8 లక్షలు కాదు. సైన్స్‌ అబద్ధం చెప్పుదు.. కానీ మోదీ చెబుతారు. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను గౌరవించండి. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం రూ. 4 లక్షల పరిహారం ఇవ్వాలి’’ అని అన్నారు. అంతకు ముందు కూడా రాహుల్‌ గాంధీ.. కరోనా కారణంగా దేశంలో 40 లక్షల మంది భారతీయులు చనిపోయారని ఆరోపించారు. 

ఇది కూడా చదవండి: సీఎంను చంపేస్తానంటూ బహిరంగంగా వార్నింగ్‌.. బీజేపీ కీలక నేత అరెస్ట్‌

మరిన్ని వార్తలు