వీడియో: రాహుల్‌ గాంధీ నైటవుట్‌, ఈసారి ఇలా..!

23 May, 2023 12:14 IST|Sakshi

ఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపుతో జోష్‌ మీద ఉన్న ఆ పార్టీ శ్రేణులు.. ఆ విక్టరీలో రాహుల్‌ గాంధీకి కూడా కొంత క్రెడిట్‌ కట్టబెట్టాయి. భారత్‌ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్‌ గెలుపులో తన వంతు పోషించారాయన. ఇదే ఊపులో సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల ఎన్నికల్లోనూ అధికారం దిశగా ప్రయత్నిస్తామని ఆయన ప్రకటించుకున్నారు కూడా.   

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి సోషల్‌మీడియా హాట్‌ టాపిక్‌గా మారారు. హర్యానా అంబాలా వద్ద సోమవారం అర్ధరాత్రి సందడి చేశారాయన. ట్రక్కులో ఆయన పర్యటించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ఛండీగఢ్‌ వెళ్లే క్రమంలో.. ఆయన ఈ పని చేసినట్లు తెలుస్తోంది. 

హెవీ వెహికల్స్‌ డ్రైవర్లు పడుతున్న కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు.. వాళ్లతో కలిసి ప్రయాణించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అంబాలా వద్ద ఆగి.. కాసేపు ఆయన ట్రక్కు డ్రైవర్లతో ముచ్చటించారు. ఆ తర్వాత ఆయన మార్గం మధ్యలో ఓ గురుద్వారాను దర్శించుకున్నారు.  

మరిన్ని వార్తలు