ప్రపంచంతో కనెక్ట్‌ అవ్వాలంటే..హిందీతోనే వర్క్‌ ఔట్‌ అవ్వదు! రాహుల్‌ కీలక వ్యాఖ్యలు

19 Dec, 2022 19:43 IST|Sakshi

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆంగ్ల విద్యను సమర్థిస్తూ  కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు పాఠశాలలో ఆంగ్ల విద్యను బోధించొద్దని గొడవ చేస్తున్నారు. కానీ వాళ్ల పిల్లలను మాత్రం ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌లోనే చదివిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కానీ పేద రైతులు, కూలీలు తమ పిల్లలు మంచిగా ఇంగ్లీష్‌ నేర్చుకుని మంచి పొజిషన్‌లో ఉండాలని కలలు కంటారని రాహుల్‌ అన్నారు.

ఈ మేరకు ఆయన రాజస్తాన్‌లో అల్వార్‌లో భారత్‌ జోడోయాత్రలో భాగంగా పర్యటిస్తున్నప్పుడూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కేవలం హిందీ మాత్రమే నేర్చుకుంటే..ప్రపంచంలో ఇతరులతో మాట్లాడటం సాధ్యం కాదని, కేవలం ఆంగ్ల విద్యతోనే అది సాధ్యం అవుతుందని అన్నారు. కాబట్టి మాకు రైతులు, కూలీల పిల్లలు అమెరికన్లతో పోటీపడి ఇంగ్లీష్‌ని నేర్చుకుని తాము అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాని చెప్పారు.

రైతులు పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లలో చదవకూడదని కూడదని బీజేపీ కోరుకుంటోందంటూ రాహుల్‌ ఆరోపణలు చేశారు. అంతేగాదు ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ..హిందీ, తమిళం వంటి ఇతర భాషలను చదవకూడదని చెప్పడం లేదు. ప్రపంచంతో కనెక్ట్‌ అవ్వాలంటే ఇంగ్లీష్‌ తెలుసుకోవాలని అన్నారు. రాజస్తాన్‌లో తాము దాదాపు 1700 ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలు ప్రారంభించినట్లు తెలిపారు. అమెరికన్‌ పిల్లలకు సవాలు విసురుతూ... విద్యార్థులు ధీటుగా ఇంగ్లీష్‌ చదవాలని కోరుకుంటున్నాను అని రాహుల్‌ గాంధీ చెప్పారు.

(చదవండి: విద్యార్థులు, సెక్యూరిటీ గార్డుల మధ్య ఘర్షణ..పలువురికి గాయాలు)

మరిన్ని వార్తలు