చైనాకు అ‍ప్పగించిన భూభాగం స్వాధీనం ఎలా?.. రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు

14 Sep, 2022 09:50 IST|Sakshi

సాక్షి, తిరువనంతపురం: కేరళలో భారత్‌ జోడో యాత్రలో పాల్గొంటున్న కాంగ్రెస్‌ కీలక నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఏప్రిల్‌ 2020కి ముందున్న స్టేటస్‌కోను కొనసాగించేందుకు చైనా తిరస్కరించిందని పేర్కొన్నారు. 

అంతేకాదు.. వెయ్యి కిలోమీటర్ల భూభాగాన్ని ప్రధాని మోదీ, చైనాకు అప్పగించారంటూ ఆరోపించారు రాహుల్‌ గాంధీ. ఈ భూభాగాన్ని తిరిగి ఎలా స్వాధీనం చేసుకుంటారో..కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారాయన.  ఈ మేరకు ఈ ఉదయం(బుధవారం) ఆయన ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు. 

రాబోయే ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ చురుకుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం కేరళలో యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే.. ఆయన తన యాత్రను ముందుకు సాగిస్తున్నారు.

ఇదీ చదవండి: అమిత్‌ షాపై రాజస్థాన్‌ సీఎం సంచలన ఆరోపణలు

మరిన్ని వార్తలు