చారిత్రాత్మక క్లాక్‌ టవర్‌ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాహుల్‌

29 Jan, 2023 15:45 IST|Sakshi

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రను శుక్రవారం భద్రత లోపాల దృష్ట్యా సడెన్‌గా నిలిపివేసిన సంగతి తెలిసింది. ఆ తదనంతరం శనివారం జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామ జిల్లాల కట్టుదిట్టమైన భద్రత నడుమ పునః ప్రారంభమైంది. ఇ​క ఈ యాత్ర ముగుస్తున్న తరుణంలో రాహుల్‌ శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో చారిత్రాత్మక క్లాక్‌ టవర్‌ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ జెండాను ఆవిష్కరణ కార్యక్రమంలో రాహుల్‌ సోదరి ప్రియాంక వాద్రా తోపాటు జమ్మూ కాశ్మీర్‌కు చెందిన పలువురు పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీ పర్యటనకు కేటాయించిన భద్రతను కాంగ్రెస్‌ నేతలకు ఏర్పాటు చేసినట్లు సమాచారం. అంతేగాదు గత రాత్రి నుంచే లాల్ చౌక్‌కు వెళ్లే అన్ని రహదారులను మూసివేసి, వాహానాల రాకపోకలను నియంత్రించారు.  

ఈ యాత్ర బౌలేవార్డ్‌ ప్రాంతంలోని నెహ్రు పార్క్‌ వరకు వెళ్తుంది. ఆ తర్వాత ఎంఏ రోడ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఎస్కే స్టేడియంలో బహిరంగ ర్యాలీ నిర్వహిస్తారు. దీనికి 23 ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆహ్వానించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ యాత్ర సెప్టెంబర్‌ 7న కన్యూకుమారి నుంచి ప్రారంభమై సుమారు 75 జిల్లాలు పర్యటించి దాదాపు 3,570 కి.మీ పాదయాత్ర చేశారు రాహుల్‌.

(చదవండి: భారత్‌ జోడో యాత్ర పునఃప్రారంభం)

మరిన్ని వార్తలు