ఇలా నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు: రాహుల్‌ గాంధీ

24 Dec, 2022 20:54 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర శనివారం ఢిల్లీలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ని పలువురు ఈ శీతకాలంలో మీరు ఎందుకు కేవలం టీ షర్ట్‌ ధరించి నడుస్తున్నారు, మీకు చలిగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. దీనికి ప్రతిగా రాహుల్‌ రైతు, కార్మికుడు, పేద పిల్లలను ఎప్పుడైనా ఇలా అడిగారా అని ఎదురు ప్రశ్న వేశారు. 

నులు వెచ్చని బట్టలు ప్రాథమిక వస్తువులు, వాటిని కొనుగోలు చేయని వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని అడిగారు. నేను సుమారు 2,800 కిలోమీటలర్లు నడిచాను కానీ అది ఏమంతా పెద్ద విషయం కాదు. నిజానికి వ్యవసాయం చేసే రైతులు, కార్మికులు, రోజు చాలా దూరం నడుస్తారు, కష్టపడతారు అని చెప్పారు. ఈ యాత్రలో అన్నిరకాల ప్రజలను కలిశాను. తాను ఇప్పుడూ ఎవరి చేయినైనా పట్టుకుని వారు ఏం పని చేశారో చెప్పగలను అన్నారు.

కన్యాకుమారి నుంచి ప్రారంభమయ్యే ఈ జోడో యాత్ర కాశ్మీర్‌లో ముగియనుంది. "నాకు సాధారణ ప్రజలలో ద్వేషం కనిపించలేదు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ద్వేషాన్ని, భయాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపణలు చేశారు. కానీ నాకు యాత్ర ప్రారంభించినప్పుడూ ప్రజల్లో ద్వేషం ఉంటుందేమోనని చాలా భయపడ్డాను." అని అన్నారు. రాహుల్‌ చేపట్టిన ఈ జోడోయాత్రలో ప్రముఖులు, స్టార్‌లు, కాంగ్రెస్‌ అధినేత మల్లికార్జున్‌ ఖర్గే తోపాటు తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక వాద్రాతో సహా అగ్ర నేతలందరూ ఈ యాత్రలో పాల్గొన్నారు.

(చదవండి: జోడో యాత్రలో పాల్గొంటే పొలిటికల్‌ కెరీర్‌ నాశనం అవుతుందన్నారు’)

మరిన్ని వార్తలు