అన్యాయంపై పోరాటానికే.. జోడో యాత్ర: రాహుల్‌

27 Sep, 2022 05:40 IST|Sakshi

పాలక్కడ్‌ (కేరళ): కుబేరుల లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తూ, రైతులు, చిన్న వ్యాపారులను రుణాల పేరిట వేధిస్తున్న మోదీ అవినీతి సర్కార్‌పై పోరాటమే భారత్‌ జోడో యాత్ర అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం యాత్ర 19వ రోజు పాలక్కడ్‌ జిల్లా కొప్పమ్‌లో పార్టీ మద్దతుదారులు, గిరిజన యువతతో రాహుల్‌ భేటీ అయ్యారు.

బీజేపీ సర్కారు తెర తీసిన రెండు రకాల హిందుస్తాన్‌ పాలనను దేశం సహించబోదన్నారు. గిరిజన వైద్యాన్ని కేంద్రం ఆయుష్‌లో భాగం చేయాలని, గిరి పుత్రుల స్కూల్, కాలేజీ డ్రాప్‌ఔట్స్‌ తగ్గించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని గిరిజనులు రాహుల్‌తో అన్నారు.

మరిన్ని వార్తలు