వందే భారత్‌ రైలులో క్లినింగ్‌ ప్రకియ చేపట్టిన రైల్వే మంత్రి: వీడియో వైరల్‌

29 Jan, 2023 14:42 IST|Sakshi

ఇప్పుడిప్పుడే మెట్రో రైలు వంటి ఆధునికతతో కూడిన హైక్లాస్‌ రైళ్లను పట్టాలెక్కించి ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది కేంద్రిం. అందులో భాగంగానే తక్కవ సమయంలో దూర ప్రయాణాలు చేయగలిగే వందే భారత్‌ వంటి హైక్లాస్‌ రైలును కూడా తీసుకొచ్చింది. మంచి ఆధునికతతో కూడిన రైలు అని మురిసిపోయేలోగే దాన్ని కూడా ప్రజలు చెత్తతో నింపేశారు. దీంతో ఆ రైలులో పరిస్థితి ఇది అంటా, అది అంటా అంటూ.. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.

దీంతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్వయంగా రంగంలోకి దిగి చెత్తను క్లీన్‌ చేశారు. శానిటరీ వర్కర్‌ మాదిరిగా డ్రైస్‌ ధరించి ఓ సంచిని పట్టుకుని ప్రతి ప్రయాణికుడి సీటు వద్దకు వెళ్లి చెత్తను సేకరించారు. విమానాల్లో మాదిరిగా క్లీనింగ్‌ విధానాన్ని అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే రైళ్లలో పరిశుభ్రతను కాపాడుకోవడంలో ప్రజలు సహకరించాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఇదిలా ఉండగా సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వందే భారత్‌ రైలు ప్లేట్లు, కప్పులు వంటి చెత్తతో నిండిపోయింది. సిబ్బంది నిర్ణిత వ్యవధిలో క్లీన్‌ చేసినప్పటికీ రైలు ‍స్టేషన్‌కి చేరుకునే సరికి చెత్తతో దారుణంగా ఉంది. దీంతో నెటిజన్ల తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రిని కోరారు. ఈ నేపథ్యంలోనే రైల్వే మంత్రి ఈ క్లినింగ్‌ ప్రక్రయను చేప‍ట్టారు.

(చదవండి: కళల అభ్యున్నతికి పాల్పడుతున్న వారిని గుర్తించాం.. 'మన్‌కీ బాత్‌'లో మోదీ)

మరిన్ని వార్తలు