రైల్వే ప్రయాణికులకు తీపికబురు

2 Apr, 2021 14:46 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ విలయం కారణంగా రైల్వే సేవలు చాలా రోజులు స్తంభించిపోయాయి. గత ఏడాది మార్చి నుంచి రెగ్యులర్‌ రైళ్లను నిలిపివేశారు. ప్రత్యేకం పేరిట ప్రస్తుతం 66 శాతం రైళ్లను నడిపిస్తున్నారు. మరో 2 నెలల్లో కోవిడ్‌ ముందునాటి సాధారణ స్థితి నెలకొంటుందని, పూర్తిస్థాయిలో సేవలు అందుతాయని రైల్వేశాఖ వర్గాలు గురువారం వెల్లడించాయి. రైళ్లను వంద శాతం పునరుద్ధరించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే, రాష్ట్రాల అభ్యంతరాలు, కరోనా పరిస్థితిని బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపాయి. ఇప్పుడు 77 శాతం మెయిల్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, 91 శాతం సబర్బన్‌ రైళ్లు, 20 శాతం ప్యాసింజర్‌ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. కొవిడ్‌ రాకముందు రోజుకు 1,768 మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, 3,634 ప్యాసింజర్లు, 5,881 సబర్బన్‌ రైళ్లు నడిచేవి.

చదవండి:

మగ ఉద్యోగులకు 24 వారాల పేరెంటల్‌ లీవ్‌

ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు పైపైకి!

మరిన్ని వార్తలు