రైల్వే ఫ్లాట్‌ ఫారం పై పుస్తకాలతో కుస్తీ పడుతున్న యువకులు: ఫోటో వైరల్‌

7 Jun, 2022 17:39 IST|Sakshi

కరెంట్‌ సదుపాయం అంతగా లేని కాలంలో క్యాండిల్‌ లైట్లు కింద చదువుకుని ఇంత గొప్ప స్థాయికి వచ్చాం అని మన పెద్దలు చెబుతుండేవారు. మరికొంతమంది ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కనీస సౌకర్యాలు లేక స్ట్రీట్‌ లైట్‌ల కింద చదువుకని పైకి వచ్చిన వాళ్లు ఉన్నారు. ఐతే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే వాళ్లంతా ఏవేవో కారణాల వల్ల చదువుకోవాలనే తాపత్రయంతో అలా కష్టపడి చదువుకున్నారు. అన్ని సౌకర్యాలు ఉ‍న్న ఈ కాలంలో ఒక విద్యార్థి గ్రూప్‌ రైల్వే ప్లాట్‌ ఫారంనే స్టడీ సెంటర్‌గా మార్చేసి మరీ తెగ చదివేస్తున్నారు. 

వివరాల్లోకెళ్తే...రైల్వే ప్లాట్‌ ఫారం పై పెద్ద సంఖ్యలో యువకులు చదవుకుంటున్నట్లు ఉన్న ఒక ఫోటో సోషల్‌ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తుంది. అసలు ఫోటో వెనక ఉ‍న్న కథ ఏమిటంటే.. బీహార్‌లోని ససారమ్ స్టేషన్ నుంచి వచ్చిన కథనం ఇది. ఆ రైల్వే ఫ్లాట్‌ ఫారం పై చదుకుకుంటన్న విద్యార్థులంతా బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాకు చెందినవారు. వారి గ్రామంలో సరైన కరెంట్‌ సదుపాయం లేకపోవడంతో ఇలా రైల్వే ఫ్లాట్‌ ఫారం పై చదువుకుంటున్నారంటూ ఓ వార్త కథనం ప్రచురితమైంది.

ఐతే 2002లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి గానీ ఇప్పుడూ అలాంటివేం లేవని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తేల్చి చెప్పేసింది. విద్యార్థులు పరీక్ష కోసం బయలుదేరి రైలు కోసం వేచి ఉన్నాప్పుడూ చోటు చేసుకున్న ఘటన అని ఒక రైల్వే అధికారి చెప్పారు. ఐతే  రైల్వే ఉద్యోగ పరీక్షలను నిర్వహించడంలో జాప్యం కారణంగా 2018లో విద్యార్థుల చేసిన నిరసన అని అక్కడి స్థానికులు చెబుతున్నారు.

కొన్ని నెలలు క్రితమే ఈ ఘటనకు సంబంధించిన ఫోటోను ఐఏఎస్‌ అధికారి అవనీష్ శరణ్ ఇదే కథనాన్ని ట్విట్టర్‌లో ..రైల్వే స్టేషన్‌లోని 1, 2 ప్లాట్‌ఫారమ్‌లు సివిల్‌ సర్వీసెస్‌పై ఆసక్తి ఉన్న యువతకు కోచింగ్‌ క్లాస్‌గా మారుతున్నాయి అని క్యాప్షన్‌ జోడించి మరీ ఆ ఫోటోను పోస్ట్‌ చేశారు. అయితే ఇప్పుడూ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ హరి సింగ్ షెకావత్ లింక్డ్‌ఐలో అదే ఫోటోతో పోస్ట్ చేయడంతో మళ్లీ వైరల్ అయింది. ఆ ఫోటో వెనుక నిజమైన కథ ఏమిటన్నది కచ్చితంగా తెలియకపోయినప్పటికీ ఆ ఫోటో మాత్రం నెటిజన్లను తెగ ఆకర్షించింది.

(చదవండి: మహిళను బలవంతంగా రైల్వే ట్రాక్‌పైకి తోసేశాడు..!)

మరిన్ని వార్తలు