76 ఏళ్ల క్రితం నాటి రైల్వే టిక్కెట్‌..ధర ఎంతో తెలుసా!

22 Jan, 2023 18:55 IST|Sakshi

76 ఏళ్ల క్రితం నాటి రైల్వే టిక్కెట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఐతే ఆ ధర వింటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. తొమ్మిది మంది ప్రయాణానికి టిక్కెట్‌ ధర వింటే షాక్‌ అవుతారు. నెటిజన్లు కూడా ఈ టిక్కెట్‌ని చూసి ఫిదా అవుతూ.. తెగ కామెంట్లు పెట్టడం ప్రారంభించారు. వివరాల్లోకెళ్తే..పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వెళ్లే ఓ పాత టిక్కెట్‌ సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. ఇది 1947 ఏళ్ల నాటి టిక్కెట్‌.

అంటే దాదాపు 76 ఏళ్ల క్రితం నాటిది. ఈ టిక్కెట్‌ చూస్తే ఒక కుటుంబం పాకిస్తాన్‌లోని రావల్పిండి నుంచి అమృత్‌సర్‌ ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఆ టిక్కెట్‌ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సెప్టెంబర్‌ 17, 1947లో సుమారు తొమ్మిది మంది రావల్పండి నుంచి అమృత్‌సర్‌ వెళ్లేందుకు కొనుగోలు చేసిన టిక్కెట్‌ అది. ఆ టిక్కెట్‌ ధర సరిగ్గా 36 రూపాయాల తొమ్మిది అణాలు. బహుశా ఆ కుటుంబం భారత్‌కి వలస వచ్చింది కాబోలు. ఐతే నెటిజన్లను మాత్రం ఈ టిక్కెట్‌ బాగా ఆకర్షించింది.

గతం తాలుకా జ్ఞాపకం అని "ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌" అంటూ మెచ్చుకుంటున్నారు. అదీగాక 76 ఏళ్ల క్రితం నాటి టిక్కెట్‌ చెక్కు చెదరకుండా ఉండటం చాలా గ్రేట్‌ అంటు పొగడ్తల జల్లు కురిపించారు. మరోక నెటిజన్‌ తన వద్ద 1949లో కొన్న ఉషా కుట్టు మిషన్‌ రసీదు నా వద్ద ఇంకా చెక్కు చెదరకుండా ఉందని చెబుతున్నాడు. అంతేగాదు ఈ టిక్కెట్‌ ధర ఆ సమయంలో ఖరీదైనదేనదేనని, ఎందుకంటే ఆరోజుల్లో సగటే లేబర్‌ చార్జీలు 15 పైసలు మాత్రమేనని చెబుతున్నారు. అయితే ఈ టిక్కెట్‌ ఖరీదు ప్రకారం పాక్‌లోని రావల్పిండి నుంచి అమృత్‌సర్‌కి ఒక్కో వ్యక్తికి రూ. 4 అంటే అత్యంత ఖరీదేనని తేల్చేశారు నెటిజన్లు. 

(చదవండి: వాట్‌ ఏ గట్స్‌ బాస్‌! నీ ఆత్మవిశ్వాసానికి సెల్యూట్‌!)

మరిన్ని వార్తలు