శక్తిపీఠాల సందర్శనకు ప్రత్యేక రైలు.. వివరాలు ఇవే..

9 Jan, 2023 07:44 IST|Sakshi

రైల్వేశాఖ, ప్రైవేటు భాగస్వామ్యంతో ‘శక్తి పీఠాల యాత్ర’ ఏర్పాటు 

ఈ నెల 16న తమిళనాడు నుంచి రైలు ప్రారంభం 

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ): కుటుంబ సభ్యులతో కలసి తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలను సం­దర్శించే వారి కోసం భారతీయ రైల్వే–ఉలా రైల్‌ టూరిజం సంయుక్తంగా ‘శక్తి పీఠాల యాత్ర’ చేపట్టినట్లు ట్రావెల్‌ టైమ్స్‌ ఎండీ విఘ్నేష్‌ గణేష్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ నెల 16న తమిళనాడు నుంచి బయలుదేరే ఈ రైలు గూడూ­రు, ఒంగోలు, తెనాలి, గుంటూరు మీదుగా సికింద్రాబాద్, ప్రయాగ, వారణాశి, గయ, కామాఖ్య, కోల్‌కతా పూరి, కోణార్క్‌ తదితర పుణ్యక్షేత్రాలలో ఉన్న కామాఖ్యదేవి శక్తిపీఠం, వారణాసి విశాలాక్షి శక్తిపీఠం, కోల్‌కత్తా కాళీ శక్తిపీఠం, అలహాబాద్‌ అలోపిదేవి శక్తిపీఠం, గయ మంగళగౌరి శక్తిపీఠం, పూరి విమలాదేవి శక్తిపీఠం, కోణార్క్‌ సూర్యనారాయణ ఆలయంతో పాటు ఇతర పర్యాటక ప్రదేశాలను చుట్టివస్తుందని పేర్కొన్నారు. 

13 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో విజయవాడలో బుకింగ్‌ చేసు­కున్న వారిని బస్సులో గుంటూరు తీసుకెళ్లి రైలు ఎక్కిస్తామని తెలిపారు. ప్రయాణంలో ఉద­యం అల్పాహారం, టీ, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు మార్గంలో రవాణా, వసతి ఏర్పాట్లు ఉంటాయని పేర్కొన్నారు. టికెట్‌ ధర అన్ని పన్ను­లతో కలసి స్లీపర్‌ క్లాస్‌ ఒక్కొక్కరికి రూ.19,950, ఏసీ 3 టైర్‌ ధర రూ.26,300 ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు విజయవాడలోని తమ కార్యాలయంలో లేదా 74167 18800, 87545 80851 ఫోన్‌ ద్వారా సంప్రదించాలని కోరారు.  

మరిన్ని వార్తలు