రైళ్లలో వృద్ధులకు రాయితీలు ఇప్పుడే కాదు: కేంద్రం 

15 Dec, 2022 07:14 IST|Sakshi

న్యూఢిల్లీ: రైల్వేలపై ఖర్చుల భారం విపరీతంగా పెరిగిపోతోందని ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. గతేడాది ప్యాసింజర్‌ సేవలకు రూ.59,000 కోట్ల రాయితీలు ఇచ్చామని, పెన్షన్లు, జీతాల బిల్లు భారీగానే ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రైళ్లలో వృద్ధులకు రాయితీలను ఇప్పట్లో పునరుద్ధరించే అవకాశం లేదని పరోక్షంగా చెప్పారు. వాటిని కరోనా సమయంలో రద్దు చేయడం తెలిసిందే.

‘‘ప్రయాణికుల సేవలకు ఏటా రూ.59,000 కోట్ల రాయితీలివ్వడం మామూలు విషయం కాదు. పైగా రూ.60,000 కోట్ల పెన్షన్‌ బిల్లు, రూ.97,000 కోట్ల జీతాల బిల్లు, రూ.40,000 కోట్ల ఇంధన ఖర్చు భరించాల్సి వస్తోంది. కొత్త నిర్ణయాలు తీసుకొనే ముందు రైల్వేల ఆర్థిక పరిస్థితినీ పరిగణనలోకి తీసుకోవాలి’’ అని ఆయన చెప్పారు.

ఇదీ చదవండి: AP: 8.22లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ 

మరిన్ని వార్తలు