ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్‌

5 Sep, 2020 18:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్తను అందించింది. అన్‌లాక్‌ 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా జారీచేసిన మార్గదర్శకాలను పాటిస్తూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా మరో 80 రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది. ఈ మేరకు రైల్వేబోర్డు చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 నుంచి రిజర్వేషన్లు ప్రక్రియ సైతం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో రైళ్లు నడిపేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు.

రైళ్ల జాబితా కోసం ఇక్కడి క్లిక్‌ చేయండి..

మరిన్ని వార్తలు