వైరల్‌ : ట్రాక్టర్‌పై అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే

10 Feb, 2021 18:56 IST|Sakshi

జైపూర్‌ : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు నెలలకు పైగా తమ నిరసన తెలియజేస్తున్న రైతులకు దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. తాజాగా రాజస్తాన్‌ కాంగ్రెస్‌కు చెందిన మీనా అనే మహిళా ఎమ్మెల్యే వినూత్న రీతిలో తన మద్దతు ప్రకటించారు. స్వయంగా తనే ట్రాక్టర్‌ నడుపుతూ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రైతుల పోరాటానికి మద్దతు తెలిపేందుకు తాను ట్రాక్టర్‌పై వచ్చినట్లు ఎమ్మెల్యే మీనా తెలిపారు. కాగా రైతు నిరసనలకు కాంగ్రెస్‌ సహా పలు రాజకీయ పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. (ఐటీ శాఖ వ్యాఖ్యలు : ముదురుతున్న ట్విటర్‌ వివాదం)

రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కేంద్ర సాగు చట్టాలను తిరస్కరిస్తూ అసెంబ్లీలో బిల్లు కూడా ఆమోదించింన సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గడిచిన రెండు నెలలకు పైగానే రైతులు ఉద్యమిస్తున్నా కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ అంశంపై ఇప్పటికే రైతులు కేంద్రం మధ్య పలుమార్లు చర్చలు జరిగినా అవి సఫలం కాలేదు. రైతుల కనీస మద్దతు ధరకు సంబంధించి ఖచ్చితమైన హామీని కోరుతున్నారు.  సాగు చట్టాలు రద్దయ్యేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని.. అప్పటివరకు ఢిల్లీ సరిహద్దుల్లోనే నిరసన కొనసాగిస్తామని. ఇళ్లకు వెళ్లబోమని రైతులు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ( ‘40 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తాం’)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు