పోలీస్‌కు సెలవు దొరకలేదు.. చివరికి స్టేషన్‌లోనే..

24 Apr, 2021 13:13 IST|Sakshi

న్యూఢిల్లీ: కరనా మహమ్మారి కారణంగా ప్రజలు ఇప్పటికే సామాజిక దూరం, లాక్‌డౌన్ అంటూ ఆంక్షలతో సాధారణ జీవితాన్ని దూరమైయ్యారు. ఇక అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే కొన్ని ప్రభుత్వ శాఖలోని ఉద్యోగులు రాత్రి పగలు అన్నతేడా లేకుండా నిరంతరం కరోనాను కట్టడి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్‌కు సెలవు మంజూరు కాకపోవడంతో తాను పని చేసే పోలీస్ స్టేషన్‌లోనే పెళ్లికి ముందు జరిగే ‘పసుపు ఫంక్షన్‌’ వేడుకను జరుపుకున్నారు. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్లో చోటు చేసుకుంది.

వివరాలు.. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ కారణంగా అత్యవసర సేవల కింద పని చేసే ఉద్యోగుల సెలవులను తాత్కాలికంగా మంజూరు చేయడం లేదు. రాజస్తాన్‌లోని దుంగార్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఓ కానిస్టేబుల్ పెళ్లి కుదిరింది. అయితే పెళ్లికి ముందు జరిగే పసుపు వేడుక కోసం సెలవు దొరక్క పోయేసరికి కానిస్టేబుల్ పని చేస్తున్న స్టేషన్‌ ముందే  ఆమె తోటి ఉద్యోగులు స్టేషన్‌ బయటే ఈ తతంగాన్ని జరిపించారు. వారు సాంప్రదాయ ప్రకారం రాజస్థానీ పాటలు పాడుతూ పెళ్లి కాబోయే వధువుకు పసుపు పూస్తూ సాధారణంగా ఈ కార్యక్రయం ఎలా జరుగుతోందో అదే విధంగా జరిపించారు.

కాగా, కరోనా సెకండ్‌ వేవ్‌, ఫస్ట్‌ వేవ్‌ కంటే బలంగా, అలాగే దానీ ప్రభావం తీవ్రత కూడా ఎక్కువగానే చూపిస్తోంది. దీంతో దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై,  పోలీసులతో పాటు ఫ్రంట్‌లైన్ కార్మికులపై పని ఒత్తిడి తీవ్రంగానే పెరిగిందని చెప్పాలి. కేసులను  పెరుగుదల కట్టడి కోసం శుక్రవారం రాజస్తాన్ ప్రభుత్వం ఆంక్షలను విధించింది. శుక్రవారం ఒక్క రోజే 64 మరణాలతో 15,398 తాజా కేసులు రాజస్తాన్‌లో నమోదయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే 4,83,273 కోవిడ్‌ కేసులు కాగా, మరణాల సంఖ్య 3,453 కు చేరుకుంది.

( చదవండి: ఆడపిల్ల పుట్టిందని.. హెలికాఫ్టర్‌ బుక్‌ చేశాడు..ఎందుకంటే! )

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు