వైరల్‌: హెలికాప్టర్‌లో ఊరేగుతూ.. ‘బరాత్‌’

25 Feb, 2021 10:33 IST|Sakshi

నయా ట్రెండ్‌.. హెలికాప్టర్‌ వెడ్డింగ్‌

జైపూర్‌: ‘జుట్టు ఉన్నమ్మ ఏ కొప్పైనా పెడుతుంది’ అన్నట్లు డబ్బులుంటే చాలు ఎన్ని వేషాలు అయినా వేయవచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ సామెత ఎక్కువగా వివాహాలకు వర్తిస్తుంది. ధనవంతుల ఇళ్లలో జరిగే పెళ్లి వేడుక చూస్తే.. ఈ సామెత గుర్తుకు వస్తుంది. వారి ఇంట పెళ్లి ఖర్చుతో కొన్ని కుటుంబాలు ఏళ్ల తరబడి సుఖంగా బతికేయగలవు. వాళ్ల డబ్బులు వాళ్ల ఇష్టం మనకెందుకు గానీ. ఇప్పుడు ఈ ధనవంతుల ముచ్చట ఎందుకంటే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ‘హెలికాప్టర్‌ వెడ్డింగ్’‌ పేరుతో ట్రెండ్‌ అవుతోంది. ఓ జర్నలిస్ట్‌ దాన్ని రిపోర్టు చేయడం కొసమెరుపు. ఈట్రేండి వివాహ వేడుక వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే..

రాజస్తాన్‌లోని షేఖావతిలో ఈ నయా వివాహ వేడుక చోటు చేసుకుంది. రతన్‌గఢ్‌ తహసీల్‌లో ఓ చిన్న గ్రామానికి చెందిన కోటీశ్వరుడు తన కుమారుడి కోరిక మేరకు ‘బరాత్’‌ వేడుక కోసం హెలికాప్టర్‌ని రంగంలోకి దించాడు. వివాహం పూర్తయిన వెంటనే కొత్త జంట బరాత్‌ వేడుక కోసం హెలికాప్టర్‌లో ఎక్కి ఊరేగింది. ఈ తతంగాన్ని రిపోర్ట్‌ చేయడం కోసం ఓ జర్నలిస్ట్‌ని కూడా నియమించుకున్నాడు సదరు పెళ్లి కుమారుడి తండ్రి. ఈ  రిపోర్టర్‌ వివాహం జరగుతున్న చోట ఉన్న పరిస్థితులు.. వధువు రియాక్షన్‌.. వరుడి స్పందన తదితర వివరాల గురించి పూస గుచ్చినట్లు రిపోర్డ్‌ చేశాడు. ‘‘కుమారుడి సంతోషం కోసం ఓ తండ్రి చేసిన ప్రయత్నం’’ అనే కామెటంరీతో వీడియో ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. 

చదవండి: 
పైశాచిక వివాహం అంటే ఏంటో తెలుసా​?
వధువు జంప్‌..చెల్లిని పెళ్లాడిన వరుడు..ఇక్కడే ట్విస్ట్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు