‘నగ్న ఫోటోలపై ఆసక్తే నాతో అలా చేయించింది’

11 Jan, 2021 17:18 IST|Sakshi

గూఢచర్యం ఆరోపణలపై రాజస్తాన్‌ వ్యక్తి అరెస్ట్‌

జైపూర్‌: రాజస్తాన్‌ లథికి చెందిన సత్యనారాయణ పాలివాల్‌(42) అనే వ్యక్తిని గూఢచర్యం ఆరోపణలపై.. అధికారిక రహస్యాల చట్టం కింద ఇంటిలిజెన్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. పాకిస్తాన్‌ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీ ఐఎస్‌ఐ హనీట్రాప్‌ వలలో చిక్కిన సత్యనారాయణ.. దేశానికి, మిలటరీకి సంబంధించిన కీలక విషయాలను వారితో పంచుకున్నాడని అధికారులు తెలిపారు. ఇక విచారణ సందర్భంగా ఐఎస్‌ఐ.. నగ్న ఫోటోలు, సెక్స్‌ చాట్‌ని ఎరగా వేసి సత్యనారాయణ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టిందని తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ‘సోషల్‌ మీడియా ఫేక్‌ అకౌంట్‌ ద్వారా సత్యనారాయణకు ఐఎస్‌ఐకి చెందిన పలువురు మహిళలతో పరిచయం ఏర్పడింది. ఇక నగ్న ఫోటోలపై సత్యనారాయణకు ఉన్న ఆసక్తిని గమనించిన సదరు మహిళలు ఆ కోవకు చెందిన ఫోటోలను అతడికి పంపేవారు. అంతేకాక అతడితో సెక్స్‌ చాట్ కూడా‌ చేసేవారు’ అని అధికారులు వెల్లడించారు. (హనీట్రాప్ కేసు : కీలక వ్యక్తి అరెస్ట్‌ )

‘ఇక నగ్న ఫోటోల మీద ఉన్న ఆసక్తితో సత్యనారాయణ దేశానికి సంబంధించిన రహస్య సమాచారం, పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో ఆర్మీ కదలికలకు గూర్చిన సున్నితమైన సమాచారాన్ని తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారా ఐఎస్‌ఐ మహిళలకు అందజేశాడు. సత్యనారాయణ సోషల్ మీడియా ఖాతాల ద్వారా చాలాకాలంగా ఐఎస్ఐతో సంప్రదింపులు జరుపుతున్నాడు. క్లిష్టమైన సమాచారం కోసం అతడిని హానీట్రాప్‌ చేశారు’ అని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. అంతేకాక నిందితుడిని కొంతకాలంగా గమనిస్తున్నామని, జైసల్మేర్‌లో అదుపులోకి తీసుకున్నప్పుడు అతని మొబైల్ ఫోన్‌లో అనేక ఆర్మీ పత్రాలు దొరికాయని అధికారులు వెల్లడించారు. (చదవండి: ఆ యాప్‌ ద్వారా భారత్‌ను టార్గెట్‌ చేస్తున్న పాక్‌!)

ఈ సందర్భంగా రాజస్తాన్‌ పోలీసులు మాట్లాడుతూ.. ‘జైసల్మేర్‌కు చెందిన సత్యనారాయణ పాలివాల్‌ని గూఢచర్యం ఆరోపణల కింద సీఐడీ స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. గత కొంతకాలంగా అతడు పాకిస్తాన్‌ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీ వ్యక్తులతో కాంటాక్ట్‌లో ఉండటమే కాక మిలిటరీకి సంబంధించిన కీలక సమాచారాన్ని వారికి చేరవేశాడు. ప్రస్తుతం అతడిని జైపూర్‌కు తరలించాము. రాజస్తాన్‌ ఇంటిలిజెన్స్‌ అధికారులు, మిలటరీ అతడిని ప్రశ్నిస్తుంది’ అని తెలిపారు.  

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు