నాణ్యమైన వృద్ధుల జీవనం భేష్‌, రాజస్తాన్‌కు మొదటి స్థానం

12 Aug, 2021 11:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘వృద్ధుల జీవన నాణ్యత’ సూచీలో రాజస్తాన్, మహారాష్ట్ర, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు టాప్‌–5లో నిలిచాయి. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి కోసం ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ కాంపిటిటివ్‌నెస్‌ సంస్థ రూపొందించిన ఈ సూచీని మండలి చైర్మన్‌ డాక్టర్‌ వివేక్‌ దేవ్‌రాయ్‌ బుధవారం ఇక్కడ విడుదల చేశారు. ఆర్థిక శ్రేయస్సు, సామాజిక శ్రేయస్సు, ఆరోగ్య వ్యవస్థ, ఆదాయ భద్రత అనే నాలుగు ప్రధాన అంశాలు, వీటికి సంబంధించిన మరో 8 అనుబంధ అంశాల ఆధారంగా ఈ సూచీ రూపొందించారు. ఈ సూచిక దేశంలోని వృద్ధుల అవసరాలు, అవకాశాలను అర్థం చేసుకునే విధానాన్ని విస్తృతం చేస్తుంది.

 50 లక్షల పైచిలుకు వృద్ధులు ఉన్న రాష్ట్రాల కేటగిరీలో రాజస్తాన్‌ మొదటి స్థానంలో నిలవగా ఏపీ 8వ స్థానంలో, తెలంగాణ 10వ స్థానంలో నిలిచాయి. 50 లక్షల కంటే తక్కువ సంఖ్యలో వృద్ధులు ఉన్న రాష్ట్రాల కేటగిరీలో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, ఒడిషా, జార్ఖండ్‌ రాష్ట్రాలు టాప్‌–5లో నిలిచాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరాం తొలి స్థానంలో నిలిచింది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఛండీగఢ్‌ తొలిస్థానంలో నిలిచింది.

మరిన్ని వార్తలు