కరోనాలోనే వింత: మహిళకు 31 సార్లు పాజిటివ్‌

23 Jan, 2021 09:55 IST|Sakshi

జైపూర్‌: మహమ్మారి కరోనా ప్రపంచతోపాటు భారతదేశంలోనూ కల్లోలం రేపుతోంది. దీనికి సంబంధించిన విషయాలు గగుర్పాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ మహిళకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 సార్లు కరోనా సోకిందట. పరీక్ష చేసుకున్నా ప్రతిసారి ఆమెకు పాజిటివ్‌ అనే వస్తోంది. దీన్ని చూసి వైద్యులే నివ్వెరపోయారు. లక్షణాలే లేకున్నా ఆమె పాజిటివ్‌ వస్తోంది. దీంతో శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఆమె నుంచి నమూనాలు సేకరించి అధ్యయనం చేస్తున్నారు.

రాజస్థాన్‌లోని అప్నాఘర్‌ ఆశ్రమానికి చెందిన శారదకు కరోనా లక్షణాలు ఏమీ లేవు. అయినా కూడా ఆమెకు కేవలం ఐదు నెలల్లోనే 31 సార్లు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆమెను భరత్‌పూర్‌ జిల్లాలోని ఆర్‌బీఎం ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. గతేడాది ఆగస్టు 20వ తేదీన ఆమెకు తొలిసారి కరోనా పరీక్ష చేయగా కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యుడు భరద్వాజ్‌ తెలిపాడు. అలా ఇప్పటివరకు శారదకు 31 సార్లు కరోనా పరీక్షలు చేయగా.. ప్రతిసారి పాజిటివ్‌ వచ్చిందని వివరించారు. ప్రారంభంలో ఆమె అస్సలు నిల్చోడానికి కూడా సాధ్యమయ్యేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది.

గతంలో ఆమె అల్లోపతి, ఆయుర్వేద, హోమియోపతి వైద్యం చేయించుకున్నారు. ఇంకా ఆశ్చర్యంగా ఆమె 7-8 కిలోల బరువు పెరగడం గమనార్హం. తొలిసారి వచ్చిన వైరస్‌ చికిత్స తీసుకున్నా శరీరంలో ఉంటుందని.. అందువల్లే ఆమెకు తరచూ పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు భావిస్తున్నారు. ఆమె కడుపు భాగంలో కరోనా వైరస్‌ ఆనవాళ్లు ఉండడంతో ఈ విధంగా జరుగుతుందని చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తి నిర్ధారణ రాలేదు. ఆమె నమూనాలు సేకరించి పరిశీలిస్తున్నారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు