భారత ఆర్మీ జాబ్‌ కోసం పెద్ద సాహసం.. 350 కిలోమీటర్లు పరుగెత్తి.. 

6 Apr, 2022 10:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత సైన్యంలో చేరాలన్నది అతని కల. ఆర్మీలో రిక్రూట్‌మెంట్‌ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. అధికారులు మాత్రం రిక్రూట్‌మెంట్‌ జరపకపోవడంతో ఓ యువకుడు పెద్ద సాహాసం చేశాడు. ఏకంగా 350 కిలోమీటర్లు పరుగెత్తి సోషల్‌ మీడియాలో నిలిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

అయితే, కోవిడ్ కారణంగా సుమారు 2 సంవత్సరాలుగా నిలిచిపోయిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ వందలాది మంది యువకులు జంతర్ మంతర్‌లో నిరసన చేపట్టారు. ఈ నిరసనల్లో పాల్గొనేందుకు రాజస్థాన్‌కు చెందిన సురేశ్ భిచార్(24).. రాజస్థాన్‌ నుంచి పరుగెత్తుకుంటూ ఢిల్లీ చేరుకున్నాడు. దాదాపు 350 కి.మీ పరుగెత్తి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు చేరాడు. చేతిలో జాతీయ జెండా పట్టుకుని 50 గంటల్లో 350 కి.మీ పరుగెత్తాడు. అనంతరం నిరసనల్లో పాల్గొన్నాడు. 

ఈ సందర్బంగా సురేశ్‌ మాట్లాడుతూ.. ‘‘మార్చి 29న పరుగు యాత్రను ప్రారంభించాను. ప్రతీరోజు ఉదయం 4 గంటలకు పరుగు ప్రారంభించి.. 11 గంటలకు ఎక్కడో ఓ చోట పెట్రోల్‌ బంకుకు చేరుకున్న తర్వాత అక్కడ విశ్రాంతి తీసుకుంటాను. సమీప ప్రాంతంలో ఉన్న ఆర్మీలో చేరేందుకు ప్రయత్నిస్తున్న అభ్యర్థుల నుండి ఆహారం తీసుకుని తింటాను. ప్రతీ గంటకు దాదాపు 7 కి.మీలు పరిగెత్తుతాను.  భారత సైన్యంలో చేరేందుకు యువతలో ఉత్సాహాన్ని నింపేందుకు ఇలా పరుగు యాత్ర ప్రారంభించా’’ అని చెప్పాడు. 

మరిన్ని వార్తలు