వైరల్‌: తలైవా స్టైల్‌లో తన్నాడు.. అంతే..

8 Jul, 2021 21:17 IST|Sakshi

వెబ్‌డెస్క్‌: రజినీకాంత్‌కు ఉ‍న్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ఆయన స్టైల్‌కి సినీ ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే. ఆయన నడక, నటన, డ్యాన్స్‌, ఫైట్‌, డైలాగ్‌ ఇలా సీన్‌ ఏదైనా సగటు ప్రేక్షకుడు సీటీ కొట్టాల్సిందే. అయితే తాజాగా రజినీ కాంత్‌ లాగా కనిపించే ఓ వ్యక్తి డయాస్ మీద నిలబడి తన చేష్టలతో ప్రజలను అలరిస్తున్నాడు. రజినీ స్టైల్‌లో కుర్చీ తన్నడానికి ప్రయత్నించాడు.

అయితే కుర్చీతో స్టంట్ చేయటానికి ప్రయత్నించినప్పుడు ఆ కుర్చీ పగిలి అందులో కాలు ఇరుక్కుపోయింది. దీంతో ఆ వ్యక్తి కింద పడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. నిరంజన్‌ మహాపాత్ర అనే నెటిజన్‌ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. 7.66 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోను వేల మంది లైక్‌ కొట్టగా.. వందల మంది కామెంట్‌ చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘ రజినీకాంత్‌ లాగా దుస్తులు ధరించవచ్చు. ఆయనలా కనిపించడానికి వేషధారణ చేసుకోవచ్చు. కానీ ఆయన స్టైల్‌ని భర్తీ చేయడం సాధ్యం కాదు.’’ అంటూ కామెంట్‌ చేశారు.
 

A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు