ఈ నెల 12న అభిమానులతో రజినీకాంత్ భేటీ

10 Jul, 2021 22:30 IST|Sakshi

చెన్నై: సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ ఈ నెల 12న అభిమానులతో సమావేశం కానున్నారు. ఈ మేరకు తన అభిమాన సంఘానికి చెందిన అన్ని జిల్లాల నాయకులకు ఆహ్వానం పంపించారు. ఇక రజనీకాంత్ రాజకీయాల్లోకి రానని చెప్పిన సంగతి తెలిసిందే.  అయితే మళ్ళీ అభిమాన సంఘ నేతలను కలుస్తున్న నేపథ్యంలో చర్చనీయాంశంగా మారింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ శుక్రవారం చెన్నైకి చేరుకున్నారు.

వైద్య ప‌రీక్ష‌ల కోసం జూన్ 19న భార్య లతా రజనీకాంత్‌తో కలిసి అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ మయో క్లినికల్‌ ఆస్పత్రిలో రజనీకాంత్‌కు వైద్యులు పలు రకాల పరీక్షలు చేశారు. ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు నిర్ధారించడంతో ఆయన తిరిగి చెన్నై చేరుకున్నారు. ఇక రజినీకాంత్‌కు ఉ‍న్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ఆయన స్టైల్‌కి సినీ ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే. ఆయన నడక, నటన, డ్యాన్స్‌, ఫైట్‌, డైలాగ్‌ ఇలా సీన్‌ ఏదైనా సగటు ప్రేక్షకుడు సీటీ కొట్టాల్సిందే.

మరిన్ని వార్తలు