అమెరికాతో రక్షణ సహకారం బలోపేతం : రాజ్‌నాథ్‌

26 Oct, 2020 17:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా రక్షణ మంత్రి డాక్టర్‌ మార్క్‌ ఎస్పర్‌తో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం సమావేశమయ్యారు. పలు రంగాల్లో రక్షణ సహకారం మరింత పెరిగేలా తమ చర్చలు ఫలవంతంగా సాగాయని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇరు దేశాల రక్షణ సంబంధాలు, పరస్పర సహకారం మరింత బలోపేతమయ్యాలా సంప్రదింపులు జరిపామని స్పష్టం చేశారు.

కాగా, ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, రక్షణ మంత్రి డాక్టర్‌ మార్క్‌ ఎస్పర్‌లు సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. వీరు ఇరువురూ మంగళవారం విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లతో సమావేశం కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌తోనూ సమావేశమవుతారు. చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో అమెరికా మంత్రుల భారత్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి : చైనా సరిహద్దులో ఆయుధ పూజ

మరిన్ని వార్తలు