ఉద్రిక్తంగానే సరిహద్దు.. రాజ్‌నాథ్‌ ప్రకటన

17 Sep, 2020 13:25 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌-చైనా సరిహద్దు వివాదంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంట్‌లో గురువారం మరోసారి ఆసక్తికర ప్రకటన చేశారు. సరిహద్దు వివాదంపై ఎంపీలు లేవనెత్తిన ప్రశ్నలకు రాజ్‌నాథ్‌ సమాధానమిచ్చారు. చైనాతో ఎలాంటి పరిస్థితులున్నా తాము ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు మరోసారి స్పష్టం చేశారు. మన సాయుధ బలగాలతో చైనాకు ఇప్పటికే గట్టిగా సమాధానమిచ్చామని.. ఇరుదేశాల మధ్య ఉన్న ఒప్పందాలను చైనా బహిరంగంగానే ఉల్లఘింస్తుందని మరోసారి గుర్తుచేశారు.

కాగా మంగళవారం చైనా సరిహద్దు వివాదంపై రాజ్‌నాథ్‌ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని సమస్య ఇంకా పరిష్కారం కాలేదని స్పష్టం చేశారు. మన బలగాలు దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నాయని, చైనా దూకుడుకు చెక్‌ పెట్టేందుకు భారత దళాలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. చైనా మొండిగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది మే నుంచి సరిహద్దుల్లో భారీగా సాయుగాధ బలగాలను మొహరించిందని వివరించారు. (చదవండి : సరిహద్దు వివాదం : రక్షణ మంత్రి కీలక ప్రకటన)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు