సోనియా వ్యాఖ్యలకు స్పందించకపోతే.. బాధ్యత పరంగా విఫలమైనట్లే: ధన్‌ఖర్‌

23 Dec, 2022 16:03 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థను దెబ్బతీయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన ఉప రాష్ట్రపతి, రాజ్యసభ​ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ ఆ వ్యాఖ్యలను ఖండించారు. న్యాయ వ్యవస్థపై సోనియా ఇలా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు.

దీంతో సభలో ఈ అంశాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ప్రమోద్‌ తివాయ్‌, సహచర సీనియర్‌ నాయకుడు మల్లికార్జున్‌ ఖర్గే లేవనెత్తారు. "లోక్‌సభ సభ్యురాలు సోనియా గాంధీ బయట మాట్లాడిన అంశాన్ని రాజ్యసభలో చర్చించకూడదు. ఒకవేళ వ్యాఖ్యానిస్తే దురదృష్టకరం ఇలా ఎప్పుడూ జరగలేదు. దయచేసి ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి లేదా వెనక్కి తీసుకోండి లేదంటే ఒక చెడ్డ ఉదాహరణగా నిలుస్తుందంటూ కాంగ్రెస్‌ నేతలు రాజ్యసభ​ చైర్మన్‌ని అభ్యర్థించారు

తాను సోనియా వ్యాఖ్యలకు ప్రతిస్పందించకపోతే తాను చేసిన ప్రమాణాన్ని ఒమ్ము చేసి రాజ్యంగా బాధ్యతలో విఫలమైనట్లేనని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామంపై విశ్వాసలేమిని సూచిస్తున్నాయన్నారు. తాను సరైన విధంగా స్పందించనట్లయితే పాలక పక్ష పార్టీని కించపరిచేలా తప్పుడూ పరిణామాలకు దారితీస్తుందని అన్నారు. అంతేగాదు న్యాయవ్యవస్థను చట్టవిరుద్ధంగా మార్చడం అంటే ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడనట్లేనని నొక్కి చెప్పారు. ఈ పక్షపాత పోరును అంతర్లీనంగంగా పరిష్కరించుకోవాలని అన్నారు. 

(చదవండి: పార్లమెంట్‌లో ‘సరిహద్దు’ రగడ.. లోక్‌సభ ఐదుసార్లు వాయిదా)

మరిన్ని వార్తలు