ఇంజనీరింగ్‌ కోర్సుల్లో రామాయణ, మహాభారతాలు....!

15 Sep, 2021 13:23 IST|Sakshi

న్యూఢిల్లీ: తులసీదాస్‌ రచించన రామాయణాన్ని గ్రాడ్యుయేషన్‌ విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చడం వల్ల ముఖ్యంగా ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుందని మధ్య ప్రదేశ్‌ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాశ్‌ సారంగ్‌ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో భవిష్యత్తరాలలో వైద్య విద్యను హిందీ మాధ్యమంలో  చదువుకునే అవకాశం అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. దీని కోసం ఒక కమిటీని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.  సిలబస్‌ కమిటీ ఉన్నత విద్యా విధానంలో భాగంగా  2021-22 విద్యా సంవత్సారానికి గానూ రామచరిత మానస్‌ కీ వ్యవహార దర్శన్‌ (అప్లైడ్‌ ఫిలాసఫీ ఆఫ్‌ రామచరిత మానస్‌)ని ప్రవేశ పెట్టేలా చేశానని చెప్పారు. 

(చదవండి: మహిళల రక్షణకై నిర్భయ స్క్వాడ్‌: ముంబై )

ఇంగ్లీష్‌ ఫౌండేషన్‌ కోర్సులో మహాభారతం లాంటి పురాణాలను ప్రవేశపెడితే.. విద్యార్థులకు వ్యక్తిత్వ వికాశానికి, నాయకత్వ లక్షణాల అభివృద్ధి తోపాటు మానవతా దృక్పథాన్ని పెంపొందించేలా దోహదపడుతుందన్నారు. ఈ మేరకు భారతదేశ సంస్కృతి ఆధ్యాత్మికతకు సంబంధించి 100 మార్కుల ప్రశ్నా పత్రం ఒకటి ఉంటుందని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుల బయోగ్రఫి కూడా పాఠ్యాంశాల్లో చేర్చాలనే ప్రతిపాదన ఉందన్నారు. దీంతో విద్యార్థులు సామాజికంగా, వైద్య పరంగానూ నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించగలిగే అవ​కాశం ఉంటుందంటూ ధీమా వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా మధ్య ప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి మోహన్‌ యాదవ్‌ మాట్లాడుతూ...." విద్యా వ్యవస్థను కాషాయికరణం చేస్తున్నాంటు వస్తోన్న ప్రతి పక్షాల విమర్శలను ఖండించారు. ఈ క్రమంలో నాసా సైతం 'రామసేతు' నిర్మాణాన్ని ప్రాచీన మానవ నిర్మిత నిర్మాణంగా అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యావ్యవస్థలో కాలనుగుణంగా మార్పులు చోటు చేసుకుంటాయి." అని అన్నారు.  దీంతో ప్రతిపక్షాలు గురుగ్రంథ సాహెబ్‌, ఖురాన్‌, బైబిల్‌ కూడా చేరిస్తే విద్యార్థులు మరిన్ని నేర్చుకునే అవకాశంతో పాటు రాజ్యంగ స్ఫూర్తి కూడా నెరవేరుతుందంటూ వ్యంగ్యాస్తాలు కురిపించారు.

(చదవండి: పర్యాటకుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఇక అంతే !: రాజస్తాన్‌)

మరిన్ని వార్తలు