రాష్ట్రపతిగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న రామ్‌నాథ్‌

26 Jul, 2021 07:47 IST|Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దేశాధినేతగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఆదివారానికి నాలుగేళ్లు పూర్తయ్యాయని రాష్ట్రపతి భవన్‌ తెలిపింది. 2017 జూలై 25న ఆయన దేశ 14వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌ నాలుగేళ్ల పాటు ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలను ఈ–బుక్‌ ద్వారా ప్రచురించింది. 13 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిపిన పర్యటనల్లో ఆయన 780 మందిని కలుసుకొని ‘అందరి రాష్ట్రపతి’గా మారారని పేర్కొంది.

ఈ నాలుగేళ్లలో ఆయన 63 బిల్లులను ఆమోదిం చారని తెలిపింది. కరోనా వారియర్లతో ఆయన సమయం గడిపి వారిలో ఉత్సాహాన్ని నింపారని పేర్కొంది. 23 దేశాధినేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి బాధ్యతలను నెరవేర్చారంది. జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి గవర్నర్లతో కాన్ఫరెన్స్‌ నిర్వహించారని తెలిపింది.  
 

మరిన్ని వార్తలు