ర్యాపిడో డ్రైవర్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌పై రావడమేంటి?.. బుక్‌ చేసిన టెకీకి వింత అనుభవం!

12 Aug, 2023 09:51 IST|Sakshi

బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ర్యాపిడోలో రైడ్‌ బుక్‌ చేశాడు. కొంతసేపటికి ర్యాపిడో డ్రైవర్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ మోటార్‌సైకిల్‌పై రావడంతో ఆ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఎంతో ఆనందపడిపోయాడు. అయితే అతని ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆ ర్యాపిడో డ్రైవర్‌ గురించి తెలుసుకున్న అతను కంగుతిన్నాడు. 

నిషిత్‌ పటేల్‌ తన ర్యాపిడో రైడ్‌ అనుభవాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. కుబెర్నెట్స్ మీట్అప్‌కు వెళ్లేందుకు అతను ర్యాపిడో రైడ్‌ బుక్‌ చేశాడు. ఆ సమయంలో తనకు ఎదురైన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నాడు. ఆ ర్యాపిడో డ్రైవర్‌ హై ఎండ్‌ మోటార్‌ సైకిల్‌పై రావడంతోపాటు, అతనొక నూతన టెక్నాలజీని రూపొందించే ఇంజినీర్‌ అని తెలిసేరికి అతను కంగుతిన్నాడు. పైగా అతను తాను పనిచేస్తున్న కుబెర్నెట్స్ క్లస్టర్‌ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించే కంపెనీలో పనిచేస్తుంటాడని తెలిసే సరికి నిషిత్‌ పటేల్‌ షాకయ్యాడు. 

ఈ పోస్టుకు 6 వేలకు పైగా వ్యూస్‌ దక్కడంతో పాటు యూజర్స్‌ నుంచి లెక్కకుమించిన కామెంట్స్‌ వస్తున్నాయి. ఒక యూజర్‌ ‘మీరు అతని సైడ్‌ బిజినెస్‌ టర్నోవర్‌ ఎంతో అడగాల్సింది’ అని నిషిత్‌ను అడగగా, ‘అవును ఆ తరువాత నా మదిలో అదే ప్రశ్న వచ్చిందని’  నిషిత్‌ తెలిపారు. మరో యూజర్‌ ‘అయితే ఏమైంది? అహ్మదాబాద్‌లో ఉన్నత విద్యాధికులు ఎన్నో ఏళ్లుగా ఓలా, ఉబర్‌, ర్యాపిడోలను నడుపుతున్నారు’ అని కామెంట్‌ చేశారు.
ఇది కూడా చదవండి:  పురావస్తు తవ్వకాల్లో విచిత్ర అద్దం.. అది అట్టాంటి ఇట్టాంటిది కాదట!
 

మరిన్ని వార్తలు