రైడ్‌ బుక్‌ చేసుకున్న మహిళకు చేదు అనుభవం..స్పందించిన కంపెనీ

15 Mar, 2023 18:59 IST|Sakshi

ఇటీవల ఆన్‌లైన్‌లో కారు లేదా బైక్‌ బుక్‌ చేసుకుని హాయిగా ఎక్కడికైనా సులభంగా ‍ప్రయాణించేస్తున్నాం. అందులోకి ర్యాపిడో వచ్చాక మరింత ప్రయాణం సులభమైంది. సింగిల్‌గా వెళ్లాలంటే ర్యాపిడో బైక్‌ బుక్‌ చేసుకుంటే చాటు తక్కువ ఖర్చుతో ఈజీగా ప్రయాణించవచ్చు. ఐతే ఇక్కడొక మహిళ కూడా అచ్చం అలానే ఆన్‌లైన్‌లో బైక్‌ బుక్‌చేసుకుంటే..ఆ ‍ర్యాపిడో డ్రైవర్‌ నుంచి మహిళ ఘోరమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఈ మేరకు ఆమె తనకు ఆ డ్రైవర్‌కు మధ్య సాగిన వాట్సాప్‌ మెసేజ్‌ల సందేశాన్ని స్క్రీన్‌ షాట్‌ తీసి మరీ ట్టిట్టర్‌లో షేర్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

వివరాల్లోకెళ్తే..హసన్‌పరీ అనే మహిళ బైక్‌ రైడ్‌ని బుక్‌ చేసుకుంటే..డ్రైవర్‌ పికప్‌ చేసు​కుని రైడ్‌ పూర్తి అయిన తర్వాత ఆ వ్యక్తి మహిళకు పంపిన మెసేజ్‌లు చూసి ఒక్కసారిగా కంగుతింది. ఆ సందేశంలో తాను ఆమె వాయిస్‌, ఫ్రోఫైల్‌ ఫోటో చూశాకే పికప్‌ చేసుకోవడానికి వచ్చానని లేదంటే అసలు పికప్‌ చేసుకోవడానికి వచ్చే వాడని కాదని చెప్పాడు. దీంతో  ఆ ర్యాపిడో డ్రైవర్‌ అనుచిత ప్రవర్తనకు మండిపడుతూ వెంటనే సదరు కంపెనీకి ఆ వాట్సాప్‌ సందేశాలను పంపించి మరీ ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన ర్యాపిడో కేర్‌ సదరు మహిళకు క్షమాపణలు చెప్పడమే గాక సదరు డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పింది.

అతను తన వృత్తి ధర్మాన్ని పాటించడంలో సరైన విధానం లేకపోవడంతోనే అలా ప్రవర్తిచాడని అని వివరణ ఇచ్చుకుంది. అలాగే ఆ మహిళను తాను బుక్‌చేసుకున్న రైడ్‌ ఐడిని రిజష్టర్‌ మొబైల్‌ నెంబర్‌ ద్వారా మెసేజ్‌ చేయండి తక్షణమై సదరు డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చింది. ఐతే నెటిజన్లు మాత్రం ఆమె ధైర్యంగా సదరు డ్రైవర్‌పై ఫిర్యాదు చేసినందుకు మెచ్చుకోవడమే గాక ఈ రోజుల్లో ర్యాషిడో డ్రైవర్లు కూడా సేఫ్‌ కాదంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతూ ట్వీట్‌ చేశారు. 

(చదవండి: ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో చిధ్రమైన స్థితిలో తల్లి మృతదేహం..కూతురు అరెస్టు)


 

మరిన్ని వార్తలు