అద్భుతమైన అరుదైన పులి!

5 Nov, 2020 12:33 IST|Sakshi

భువనేశ్వర్‌: చాలా అరుదైన ఒక పులి ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. పులులు ఎక్కువుగా పసుపు చారాలతో ఉండటం చూస్తూ ఉంటాం. అయితే ఈ పులి మాత్రం నల్లని రంగులో ఉంది. ఒడిశాలోని సిమ్లిపాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో ఒక జౌత్సాహిక ఫోటోగ్రాఫర్‌ ఈ ఫోటోలను తీశాడు. దీని గురించి ఫోటోగ్రాఫర్‌ సౌమెన్‌ బాజ్‌పేయ్‌ మాట్లాడుతూ, ‘నేను చాలా పులులను చూశాను. ఇక్కడ పక్షులను, జంతువులను చూస్తుండగా అనుకోకుండా ఒక నల్లని చారల పులి వచ్చింది. అయితే మొదట నేను దానిని గుర్తుపట్టలేదు. అది కొన్ని నిమిషాల వరకు నా కళ్ల ముందు ఉంది. అప్పుడు అది భిన్నమైన పులి అని నాకు అర్థం అయ్యి వెంటనే ఫోటోలు తీశాను. ఈ పులి నా కంట పడటం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అని అన్నారు. 

ఇక ఈ నల్లచారల పులి  విషయానికి వస్తే దీనిని 1990వ దశకంలో ఒడిశాలో కనుగొన్నారు. ఇవి ఎక్కువగా ఒడిశాలోని సిమ్లిపాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో కనిపిస్తాయి. వీటిని మెలనిన్‌ టైగర్స్‌గా వ్యవహరిస్తారు. ఎందుకంటే శరీరంలో ఉండే మెలనిన్‌ రంగుకు ప్రధాన కారణమవుతోంది. ఇది ఎక్కువగా ఉంటే నలుపు రంగులో కనిపిస్తారు. నల్లరంగు పులుల సంఖ్య దేశంలో గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుం ఆరో, ఏడో నల్లపులుల మాత్రమే ఉన్నాయి. ఇవి దాదాపు బెంగాల్‌ టైగార్‌లా కనిపిస్తాయి. అయితే సైజ్‌లో మాత్రం బెంగాల్‌ టైగర్‌ కంటే చిన్నగా ఉంటాయి. 

చదవండి: కారు ఇంజిన్‌లో కొండచిలువ.. ఎలా వచ్చిందబ్బా!

మరిన్ని వార్తలు