ఈపీఎఫ్‌ వడ్డీపై కీలక నిర్ణయం!

17 Feb, 2021 18:58 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధిపై (ఈపీఎఫ్‌) 2020–21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ ఎంత ఇవ్వాలన్నది మార్చి 4న జరిగే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. శ్రీనగర్‌లో మార్చి 4న సమావేశం విషయమై తనకు ఆహ్వానం అందినట్టు ట్రస్టీ కేఈ రఘునాథన్‌ మీడియాకు తెలిపారు. తనకు వచ్చిన మెయిల్‌లో వడ్డీపై నిర్ణయ అంశం లేదని స్పష్టం చేశారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2019–20) సభ్యుల భవిష్యనిధి నిల్వలపై 8.5 శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్‌వో అందించిన విషయం తెలిసిందే.

అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు ఇంత ఇవ్వడం సాధ్యపడక పోవచ్చని, రేటును తగ్గించే అవకాశాలున్నాయనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో సభ్యులు ఎక్కువగా తమ నిధులను ఉపసంహరించుకోవడంతో పాటు, తాజా జమలు తగ్గడం ఇందుకు కారణం కావచ్చని తెలుస్తోంది. 2018–19లో ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.65 శాతంగా ఉన్న విషయం గమనార్హం. 2019–20కు ఆఫర్‌ చేసిన 8.5% రేటు అనేది 2012–13 తర్వాత అత్యంత కనిష్ట రేటు.(చదవండి: ఐదు సెకన్లలో 20 లక్షల ఎస్‌బీఐ పర్సనల్ లోన్)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు