ట్విటర్‌ ఫాలోవర్స్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ ఆర్‌బీఐ

23 Nov, 2020 13:13 IST|Sakshi

ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్‌

రెండవ స్థానంలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మెక్సికో

దిగ్గజ కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌కు 4వ ర్యాంకు

సహోద్యోగులకు అభినందనలు: ఆర్‌బీఐ గవర్నర్‌

ముంబై: ప్రపంచంలోనే అత్యధికంగా ట్విట్టర్‌ ఫాలోవర్స్‌ ఉన్నకేంద్ర బ్యాంక్‌ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నిలిచింది. ఆదివారం నాటికి ఆర్‌బిఐ ట్విటర్‌ ఖాతాలో ప్రపంచవ్యాప్తంగా 10లక్షలకు పైగా ఫాలోవర్స్‌  నమోదయ్యారు. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మరియు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కంటే ఆర్బిఐకి ఎక్కువ మంది ట్విట్టర్ ఫాలోవర్స్‌ ఉండటం గమనార్హం. కాగా.. ట్విట్టర్లో రెండవ స్థానంలో  సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మెక్సికోకు 7.74 లక్షల మంది, బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియాకు 7.57 లక్షలు మంది చొప్పున ఫాలోవర్స్‌ ఉన్నారు. (ట్విటర్ ఫ్లీట్స్‌లో భారీ లోపం)

ప్రపంచంలోని ప్రముఖ సెంట్రల్ బ్యాంక్ అయిన యుఎస్ ఫెడరల్ రిజర్వ్‌కు కేవలం 6.77 లక్షల ఫలోవర్స్‌ ఉన్నారు. ప్రపంచంలో రెండవ అత్యంత శక్తివంతమైన ద్రవ్య అధికారి యురోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసిబి)కి ట్విట్టర్లో 5.91 లక్షల ఫాలోవర్స్‌ ఉన్నారు. ఈసీబి తరువాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్ 3.82 లక్షలు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ 3.17 లక్షలు, బ్యాంక్ ఆఫ్ కెనడా 1.80 లక్షలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ 1.16 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు."ఆర్బిఐ ట్విట్టర్ ఖాతా ఈ రోజు ఒక మిలియన్ ఫాలోవర్స్‌కు చేరుకుంది. ఇది మనకు ఒక కొత్త మైలురాయి. ఆర్‌బిఐలో నా సహోద్యోగులందరికీ అభినందనలు ”అని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ట్విట్టర్ వేదికగా అభినందించారు.

మరిన్ని వార్తలు