భారత్‌లో స్పుత్నిక్‌ టీకా తయారీ మొదలు

25 May, 2021 10:13 IST|Sakshi

న్యూఢిల్లీ: రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌), భారత ఔషధ దిగ్గజం పనాసియా బయోటెక్‌లు స్పుత్నిక్‌–వి కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీని భారత్‌లో ప్రారంభించాయి. ఈ మేరకు రెండు సంస్థలు సంయుక్తంగా సోమవారం ఒక ప్రకటన విడుదల చేశాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని బద్ది వద్ద ఉన్న పనాసియా బయోటెక్‌ తయారీకేంద్రం వద్ద వ్యాక్సిన్‌ను ఉత్పత్తిని మొదలుపెట్టినట్లు  తెలిపాయి. వ్యాక్సిన్‌ తయారు చేశాక నాణ్యతను పరీక్షించేందుకు రష్యాలోని గమాలియా సెంటర్‌కు పంపిస్తామని తెలిపాయి.

ఏడాదికి 10 కోట్ల స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ డోసులను తయారు చేసేందుకు ఆర్‌డీఐఎఫ్, పనాసియాల మధ్య ఏప్రిల్‌లోనే ఒప్పందం కుదిరినట్లు తెలిపింది. భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ అందించి వైరస్‌ను రూపుమాపడమే తమ లక్ష్యమని ఆర్‌డీఐఎఫ్‌ చీఫ్‌ క్రిమిల్‌ దిమిత్రివ్‌ చెప్పారు. భారత్‌లో స్పుత్నిక్‌ అత్యవసర వినియోగానికి గత నెలలోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

(చదవండి: కేరళ మంత్రుల్లో 60% మందిపై క్రిమినల్‌ కేసులు..13 మంది కోటీశ్వరులే

మరిన్ని వార్తలు