రిసెప్షనిస్టు హత్య కేసు: అంత్యక్రియలకు ససేమిరా! అంటున్న తల్లిదండ్రులు

25 Sep, 2022 12:00 IST|Sakshi

Receptionist Murder Case:ఉత్తరాఖండ్‌లోని 19 ఏళ్ల యువతి రిసెప్షనిస్ట్‌ అంకితా భండారి హత్య కేసు పెద్ద కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ హ్యత కేసులో బీజీపీ నేత వినోద్‌ ఆర్య కొడుకు పుల్కిత్‌ ఆర్య నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు కూడా. ఆ తర్వాత బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు శనివారం చిల్లా కాలువా నుంచి స్వాధీనం చేసుకున్నారు. అంతేగాదు ఈ కేసుకి సంబంధించి ఆమె వాట్సాప్‌ చాట్‌లపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదిలా ఉండగా అంకితా కుటుంబసభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వాహించేందుకు నిరాకరించారు. ఆమె పోస్ట్‌మార్టం రిపోర్టు అప్పగించిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని పట్టుబట్టారు. ఐతే నిందితుల ఇలాంటి తప్పలు చేసేందుకు భయపడేలా వారి రిసార్టును కూల్చివేయాల్సిందిగా సీఎం ధామీ పుష్కర్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ విషయమై అంకితా తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రిసార్ట్‌ కూల్చివేతతో కీలక ఆధారాలు మాయమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఇలా ఎందుకు చేశారంటూ...ఉత్తరాఖండ్‌​ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు డీఐజీ మాట్లాడుతూ...రిసార్ట్‌లో పని చేస్తున్న ప్రతి ఉద్యోగిని విచారించాం. ప్రతి ఒక్కరి నుంచి వాగ్మూలం తీసుకుంటున్నాం. రిసార్ట్‌ నేపథ్యంపై కూడా దర్యాప్తు చేస్తున్నాం. అలాగే వెలుగులోకి వచ్చిన సదరు బాధితురాలు అంకితా భండారీ వాట్సాప్‌లను కూడా పరీశీలిస్తున్నాం.

అయినా మాకు ఇంకా పోస్ట్‌మార్టం నివేదిక అందలేదు. తొందరలోనే అందే అవకాశం ఉందని ఆశిస్తున్నాం. అని అన్నారు. అయితే అంకితా కుటుంబీకులు మాత్రం అంత్యక్రియలు చేసేదే లేదని తెగేసి చెబుతున్నారు. అంతేగాదు ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు విచారించాలని, నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. 

(చదవండి: రిసెప్షనిస్ట్‌ హత్య కేసులో కీలక విషయాలు..)

మరిన్ని వార్తలు